మంచు విష్ణు ఒకప్పుడు కామిడీ ఒకప్పుడు ఎంటర్టైనింగ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న దర్శకుడు  శ్రీను వైట్ల వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సాలిడ్ ఎంటర్టైనర్ " డీ " చిత్రం.  మన టాలీవుడ్ లో మోస్ట్ ఎంటర్టైనింగ్ కామెడీ సినిమాల లిస్ట్ తీసుకున్నట్టయతే వాటిలో ఈ చిత్రం ముందు వరుసలో ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమా మంచు విష్ణు కెరియర్ లో సినిమా చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు ఆయన కెరియర్ లో మొదటి బ్లాక్ బస్టర్ ఈ సినిమాతోనే లభించింది..

 ఈ సినిమా లో బ్రహ్మానందం తో కలిసి విష్ణు చేసే కామిడీ కి సమరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమాతోనే కామిడీ ని పర్ఫెక్ట్ టైమింగ్ తో చూపించే దర్శకునిగా శ్రీను వైట్లకు మంచి గుర్తింపు వచ్చింది.దాంతో శ్రీను వైట్ల - మంచు విష్ణు కాంబినేషన్ అంటే ఆడియన్స్ లో మంచి బెంచ్ మార్క్ ను సెట్ చేసుకుంది.  మరి మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుడడంతో ఆడియన్స్ లో వీరి తాజా చిత్రం పై మంచి ఆసక్తి ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గత చిత్రం " డీ " కాగా వీరి తాజా చిత్రం కు  “ఢీ 2″(డబుల్ డోస్) టైటిల్ అనౌన్స్ చేశారు.

 ప్రస్తుతం ఈ సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి.  అయితే ఈ సినిమా "డీ " చిత్రానికి సిక్వల్ కాదని ఈ తాజా చిత్రం పూర్తిగా కొత్తతో తెరకెక్కిస్తున్నట్లు అని ప్రకటించారు. మరి ఈ సినిమాకు గాను మంచు విష్ణు మైండ్ బ్లోయింగ్ మేకోవర్ ను రెడీ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా కోసం తాను ప్రిపేర్ చేస్తున్న లుక్ తాలూకా జిమ్ వీడియోనే సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది..మరి ఈ సినిమాతో ఈ ఇద్దరి హిట్ కాంబినేషన్ ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: