సాధారణంగా మన దర్శక నిర్మాతలు కథలను కొన్ని ఆలోచించి రాస్తే, మరి కొంతమంది యథార్థ సంఘటనలను తీసుకొని తెరకెక్కిస్తు బ్లాక్ బస్టర్ హిట్ లను కొడుతూ ఉంటారు. అలాంటి చిత్రాలలో ఒకటి ఆ నలుగురు సినిమా కూడా. అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన ఆ నలుగురు సినిమా ఎంత  ప్రభంజనాన్ని సృష్టించిందో పెద్దగా చెప్పనవసరం లేదు .ఇప్పుడు మరోసారి వచ్చినదే బిక్షగాడు. ఒకసారి శశి అనే తమిళ డైరెక్టర్ తన బుక్స్ సర్దుకుంటుంటే అనుకోకుండా ఓ న్యూస్ పేపర్ ని చూసాడు. అందులో ఒక బిచ్చగాడిగా మారిన ఒక బిజినెస్ మాన్ అనే ఒక స్టోరీని చదివాడు. తరువాత అదే రోజు రాత్రి నిద్రలో కూడా అదే న్యూస్ తనకు కలలో కూడా వచ్చింది.


ఇక మర్నాటి నుండి అదే స్టోరీ కి ఇంకాస్త డ్రామా యాడ్ చేసి, స్టోరీ రాయడం మొదలు పెట్టాడు శశి. ఫైనల్ గా అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ అయింది. ఇదే కథను సినిమాగా తీద్దామని తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తనకు తెలిసిన కొంతమందికి వివరించగా బిచ్చగాడి పేరుతో సినిమా ఏంటి..అని నిరుత్సాహ పరిచారు. అయినా తను రాసుకున్న కథ మీద నమ్మకంతో ఆయన ప్రయత్నాలు చేస్తూనే  వున్నాడు. అప్పుడే విజయ్ ఆంటోని ను సంప్రదించాలి అనుకున్నాడు. ఇక విజయ్ ఆంటోనీ ని ఎందుకు సంప్రదించాడు అంటే ఒకవేళ విజయ్ కి ఆ కథ నచ్చితే అతడే ప్రొడ్యూసర్ గా, హీరోగా, మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తాడు అనే ఒక నమ్మకం. ఇక అప్పటికే కొన్ని సినిమాలు కూడా చేశాడు.


ఒకవేళ విజయ్ కి కథ నచ్చితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకున్నాడు శశి. అనుకున్నట్టుగానే స్క్రిప్టును విజయ్ కు వినిపించాడు.  ఇక ఇంప్రెస్ అయిన విజయ్.. హీరో గా ప్రొడ్యూసర్ గా చేయడానికి ఒప్పుకున్నాడు.. మ్యూజిక్ డైరెక్టర్ గా వేరే వాళ్ళను పెట్టుకుందాం అని అన్నాడు విజయ్. సరే అని చెప్పిన శశి షూటింగ్ స్టార్ట్ చేశాడు.రూ. రెండు కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తీశారు. ఇక వేరే వాళ్లు ఈ సినిమాకు మ్యూజిక్ చేయడానికి ముందుకు రాకపోవడంతో విజయ్ ఆంటోని నే మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించాడు.


ఇక ఎవరూ ఊహించని విధంగా సినిమా రిలీజ్ అయినప్పటి నుండి హిట్ టాక్ తో దూసుకెళ్లి,  బిచ్చగాడు దాదాపు రూ.నలభై కోట్లు కలెక్ట్ చేసింది.. ఇక ఇదే సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్న రానా ను, సునీల్ ను  సంప్రదిస్తే  ఇక్కడి ప్రేక్షకులు ఈ కథను  యాక్సెప్ట్ చేయరని రిజెక్ట్ చేశారు. అదే సమయంలో  చదలవాడ లక్ష్మణ్సినిమా డబ్బింగ్ రైట్స్ను రూ.45 లక్షల పెట్టి, కొని, ఆ సినిమాను తెలుగులోకి డబ్ చేశారు.  ఎవరూ ఊహించని విధంగా మొత్తం రూ.20 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. అంతే కాకుండా ఈ సినిమా దాదాపు 100  మందిని లక్షాధికారులను కూడా చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: