స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఎర్రచందనం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం లో అల్లు అర్జున్ డైలీవేజ్ లేబ‌ర్‌గా పుష్ప‌రాజ్ అనే పాత్రలో నటిస్తున్నారు. అయితే అచ్చం డైలీ లేబ‌ర్‌గా కనిపించేందుకు అల్లు అర్జున్ మాసిన గడ్డం, గుబురు జట్టు, పెద్ద మీసం, రిగ్గడ్ ఐబ్రౌస్, జిడ్డు మొహం తో ఒక సరికొత్త అవతారమెత్తుతున్నారు. ఐతే లారీ డ్రైవర్ గెటప్ కోసం అల్లు అర్జున్ గంటల తరబడి మేకప్ రూమ్ లోనే సమయం వెచ్చించాల్సి వస్తోందట.

విశ్వసనీయ వర్గాల ప్రకారం.. అల్లు అర్జున్ ని ఒక డైలీ లేబర్ గా మార్చడానికి మేకప్ మ్యాన్ కి దాదాపు మూడున్నర గంటల సమయం పడుతుందట. దీన్నిబట్టి అల్లు అర్జున్ పూర్తిగా ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నారని ప్రేక్షకులు అర్థం చేసుకోవచ్చు. హై వోల్టెజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న పుష్ప సినిమా తో భారత దేశ వ్యాప్తంగా కోట్ల మంది ప్రేక్షకులను అలరించడానికి అల్లు అర్జున్ బాగా కష్టపడుతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాతో ఆయన ప్యాన్ ఇండియా స్టార్ అవుతారని చెప్పుకోవచ్చు.

ఇకపోతే ఇప్పటికే పుష్ప సినిమాకి సంబంధించిన రెండు షెడ్యూల్స్ పూర్తి చేశారు. కొన్ని కీలకమైన సన్నివేశాలు మాత్రం త్వరలోనే తమిళనాడులోని టెన్‌కాసిలో చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్ తనతో పాటే పర్సనల్ జిమ్ ట్రైనర్ ను, అలాగే ఓ వంట మనిషిని తమిళనాడు రాష్ట్రానికి తీసుకెళ్లనున్నారు. ఆర్య, ఆర్య 2 తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబో లో మూడవదిగా పుష్ప సినిమా తెరకెక్కుతోంది. అయితే మైత్రీ మూవీమేక‌ర్స్, ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న పుష్ప సినిమా ఆగస్టు 13వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్నది. రంగస్థలం తరువాత సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: