ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోతున్నాడు.. తన కెరీర్ స్టార్టింగ్ లో అన్ని ఒకే తరహా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన ఈ హీరో.. ఇప్పుడు తన పంథా మార్చి రొటీన్ కి భిన్నమైన మంచి కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు.. ఈ నేపథ్యంలోనే నాగ శౌర్య ఎక్కువగా కొత్త దర్శకులతో వర్క్ చేయడానికే ఆసక్తి చూపుతున్నాడు.. ఇక ఒక వైపు లక్ష్య, వరుడు కావాలెను చిత్రాలతో పాటు తన బ్యానర్లో అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓసినిమా చేస్తున్నాడు.

ఇది కాకుండా శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాతగా ఆయన బ్యానర్‌లో ఓ సినిమా చేయడానికి శౌర్య ఓకే చెప్పాడట. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉందని, ఆ పాత్రలో నందమూరి బాలకృష్ణ నటిస్తాడని వార్తలు వినిపించాయి. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమాలో బాలకృష్ణ నటించనని చెప్పేశాడట. దీంతో నిర్మాతలు ఆ పాత్రలో నాగార్జున అక్కినేనిని నటింప చేయాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట. మరి నాగార్జున అతిథి పాత్రలో నటించడానికి ఒప్పుకుంటాడో లేదో చూడాలి. ఈ చిత్రంలో నాగశౌర్య మాటలు మాట్లాడలేని, చెవులు వినిపించని యువకుడి పాత్రలో కనిపిస్తాడట.

ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేముల అనే దర్శకుడు తెరకెక్కించనున్నాడని టాక్..ఒకవేళ ఈ సినిమాలో అతిథి పాత్ర పోషించడానికి నాగ్ ఒప్పుకుంటే అది కచ్చితంగా నాగ శౌర్య సినిమాకి మెయిన్ హైలైట్ అవుతుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పాలి..ఇక ప్రస్తుతం నాగార్జున.. వైల్డ్ డాగ్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఓ సరికొత్త థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో నాగార్జున ఓ ఇన్వెస్ట్ గేటివ్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు..ఇక ఈ సినిమాతో పాటు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఇటీవలే ఓ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాగ్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: