అక్కినేని వారసుడు నాగచైతన్య సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభంజనాన్ని సృష్టిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే నాగచైతన్య సినీ కెరియర్ లో  ప్రశంసలతో పాటు భారీగా కలెక్షన్లు రాబట్టిన సినిమాలలో మజిలీ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా  భారీ అంచనాలతో విడుదలయ్యి ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. అయితే ఈ సినిమాలో సమంత మొదటి హీరోయిన్ గా నటిస్తే, సెకండ్ హీరోయిన్ గా దివ్యాంశ  కౌశిక్ నటించింది. ఉత్తర  భారతదేశానికి చెందిన అమ్మాయిగా  దివ్యాంశ ఈ సినిమాలో నటించగా, ఆమె తన అందంతో,నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా హిట్ అవడంతో ఈ అమ్మాయికి కూడా అవకాశాలు చాలానే వస్తాయని అనుకున్నారు అందరూ..కానీ ఏమైందో తెలియదు కానీ ఈమె సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తోంది..


దివ్యాంశ పై ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలన్నీ ఒక్కసారిగా తారుమారయ్యాయి. ఇక ఈ సినిమా తర్వాత ఆమెకు పెద్దగా తెలుగులో ఆఫర్లు రాలేదు. మజిలీ సినిమా విడుదలయ్యి ఒకటిన్నర సంవత్సరం అవుతున్నప్పటికీ ఈమె గురించి ఎలాంటి సమాచారం అందకపోవడంతో ప్రేక్షకులలో దివ్యాంశ కౌశిక్ కు ఏమైంది..? ఆమె ఎక్కడుంది..? అనే ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం..


నిజానికీ దివ్యాంశ కు సినిమాల్లో చేయడం ఇష్టం లేదా..? లేక ఆమె కొత్త సినిమాలకు ఓకే చెప్పడం లేదా..? లేదా దర్శకులు ఆమెను సినిమాలలోకి ఆహ్వానించడం లేదా..? అనే ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు  సమాధానం తెలియాల్సి ఉంది.. అయితే ఈ సినిమాలో దివ్యాంశ కుర్రకారు హృదయాలను దోచుకుంది అనే చెప్పాలి..

ఇదిలా ఉండగా అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను దోచుకున్న  దివ్యాంశ తెలుగులో మరిన్ని సినిమాలు చేస్తే బాగుంటుంది అని ఆమె ఫాన్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో కూడా సినిమాలు హిట్ అయినా అవకాశాలు రాక, కొంతమంది హీరోయిన్లు సినీ ఇండస్ట్రీకి దూరం కాగా ఇక ఆ లిస్టులో దివ్యాంశ పేరు కూడా చేర్చారు. దీంతో ఆమె అభిమానులు ఆమె మళ్లీ సినీ ఇండస్ట్రీలోకి రావాలని  కోరుకుంటున్నారు. అయితే న్యూఢిల్లీకి చెందిన దివ్యాంశ  మోడల్ గా కెరీర్ను  ప్రారంభించి మజిలీ సినిమాలో అవకాశాన్ని పొందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: