సినిమా తీసిన తర్వాత ఏ దర్శకుడైన ఆ సినిమాని ఎప్పుడు విడుదల చేయాలనీ ఆలోచిస్తుంటారు. విడుదల విషయం లో దర్శకులు చాలా జాగ్రత్తలు వహిచడం మనం చూస్తుంటాం. ఒక తేదీ అనుకోని తర్వాత ఆ తేదీని మార్చడం వంటివి దర్శకులు చేస్తుంటారు. అయితే పవన్ కళ్యాణ్ కి 'ఏప్రిల్' నెలకి సంబంధం ఉంది. అదేంటంటే అయన చేసిన కొన్ని సినిమాలు ఏప్రిల్ నెలలోనే విడుదల అయ్యాయి. ఇప్పుడు రాబోయే 'వకీల్ సాబ్' నుండి అయన అంతకు ముందు చేసిన సినిమాలు కొన్ని ఈ ఏప్రిల్ నెలలోనే విడుదల అయ్యాయి.

ముందుగా వకీల్ సాబ్ ని చిత్ర బృందం ఏప్రిల్ తొమ్మిదవ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దాదాపుడు రెండు సంవత్సర తర్వాత పవన్ నుండి వస్తున్నా సినిమా కావున అభిమానులు ఏప్రిల్ 9 ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు. ఇదే కాకా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలిచిపోయే చిత్రం 'ఖుషి' కూడా ఏప్రిల్ నెలలో విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది.

అలాగే పవన్ కళ్యాణ్- పూరిజగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 'బద్రి' కూడా ఏప్రిల్ లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. మరియు పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కలయికలో వచ్చిన తొలి చిత్రం అయిన 'జల్సా' కూడా ఏప్రిల్ లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అలాగే ఒక   పవన్ కళ్యాణ్ కి మంచి స్నేహితుడిని దొరికేలా చేసింది.

వీటితో పాటు పవన్ కళ్యాణ్ దర్శకుడిగా మారి చేసిన మొదటి చిత్రం 'జానీ', మరియు 'గబ్బర్ సింగ్ ' తరహాలో వచ్చిన మరో చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్' కూడా ఏప్రిల్ నెలలోనే విడుదలైయ్యాయి. చూసారు కదా 'ఏప్రిల్' నెలలో విడుదలైన  పవన్ కళ్యాణ్ సినిమాలు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్  వరుస సినిమాలను చేస్తూ బిజీగా గడుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: