అక్కినేని నాగార్జునలో మంచి నటుడు ఉన్నాడు. అంతే కాదు, మంచి ప్రొడ్యూసర్ కూడా ఉన్నాడు. నాగ్ ఒక వైపు సినిమాలు చేసుకుంటూనే మరో వైపు నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. ఇక నాగార్జున తన జోరుని ఒక్కసారిగా పెంచేశాడు.

వరసపెట్టి సినిమాలు చేయడానికి డిసైడ్ అయిపోయాడు. అయితే అందరి హీరోల కంటే ముందుగానే నాగార్జున లాక్ డౌన్ టైమ్ లో కూడా ఏ మాత్రం భయపడకుండా సెట్స్ మీదకు వెళ్ళి షూటింగ్  చేసిన సినిమా వైల్డ్ డాగ్. ఈ సినిమాలో నాగార్జున జాతీయ భద్రతా అధికారిగా నటించారని తెలుస్తోంది. యాక్షన్ తో పాటు అనేక ట్విస్టులతో ఈ సినిమాను తీశారు. ఇక ఈ మూవీని ఓటీటీకి ఇద్దామని కూడా నిర్ణయించారు. దాంతో నెట్ ఫ్లిక్స్ తో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ విధంగా కుదుర్చుకున్న బిగ్ డీల్ ని సడెన్ గా క్యాన్సిల్ చేశారని టాక్. ఎందువల్ల అంటే ఈ మూవీ విషయంలో నాగార్జున చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. ఈ మూవీ చాలా బాగా వచ్చిందట. దాంతో ఏకంగా థియేటర్లలోనే రిలీజ్ చేయడానికి నాగార్జున ఓకే చెప్పాడట.

దాంతో నెట్ ఫ్లిక్స్ తో ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకుని మరీ నాగార్జున థియేటర్లలో రిలీజ్ అని ఎందుకు పట్టుపడుతున్నారో కానీ ఈ మూవీ బ్లాక్ బస్టర్ అని నాగార్జున భావిస్తున్నాడుట. నాగార్జునలో మంచి జడ్జి ఉన్నాడన్న సంగతి తెలిసిందే. ఆయన ఏ సినిమా హిట్ అవుతుంది. ఏది ఫట్ అవుతుంది అన్నది కచ్చితంగా చెప్పేయగలరు. ఇపుడు వైల్డ్ డాగ్ చూసి థియేటర్లలో రిలీజ్ కొడితే గ్యారంటీ హిట్ అని నాగ్ అనుకోవడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారుట. ఈ మూవీ విషయంలో నాగ్ అంచనాలు తప్పవని అంటున్నారు. అంటే బొమ్మ సూపర్ హిటే అన్న మాటేగా.

మరింత సమాచారం తెలుసుకోండి: