ప్రస్తుతం యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకోవడానికి ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. కమర్షియల్ హంగులతో కూడిన ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఎందుకో  ఈ హీరో మాత్రం నిలదొక్కుకోలేక పోతున్నాడు.  బలమైన సినిమా బ్యాక్ గ్రౌండ్ వున్నప్పటికీ ప్రేక్షకుల ఆదరణ మాత్రం పొందలేకపోతున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.  మొదట అల్లుడు శీను సినిమా తో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే విజయం అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇక ఆ తరువాత చాలా కాలం పాటు విజయానికి దూరమయ్యాడు.


 ఇక మధ్యలో అడపాదడపా విజయాలు మాత్రమే అందుకున్నాడు.  ఇక ఇటీవలే అల్లుడు అదుర్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ మళ్లీ నిరాశే ఎదురైంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టాలీవుడ్ లో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చత్రపతి హిందీ రీమేక్ సినిమాలో నటించేందుకు సిద్దమయ్యాడు అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని అటు బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.  ఇక ఈ సినిమా కోసం బెల్లంకొండ హీరో కొత్త లుక్ లో కి మారిపోయినట్లు తెలుస్తుంది.



 అయితే బాలీవుడ్లో రీమేక్ కాబోతున్న టాలీవుడ్ చత్రపతి మూవీ కోసం కొత్త లుక్ లోకి మారిపోయాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ లుక్  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  అభిమానుల అందరినీ ఎంతగానో ఆకర్షిస్తుంది అయితే ఈ లుక్ చత్రపతి సినిమా కోసం కాదని.. చత్రపతి సినిమా కు ముందే టాలీవుడ్ లో తెరకెక్కబోయే మరో సినిమా కోసం అన్న ప్రచారం కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతుంది. మరి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త లుక్ ఏ సినిమా కోసం అన్నది మాత్రం మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: