పోసాని కృష్ణ మురళి తెలుగు చలన చిత్ర రంగంలో రచయితగా, దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన దాదాపు 150 సినిమాలకు రచయితగా పనిచేశారు. గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామంలో పుట్టి పెరిగిన పోసాని కృష్ణ మురళి బీకాం పూర్తి చేసి ఆ తర్వాత నాగార్జున యూనివర్సిటీలో తెలుగు లిటరేచర్ లో ఎంఏ పూర్తిచేశారు. అనంతరం ఆయన హైదరాబాదులో చిట్ ఫండ్ కంపెనీలో పనిచేశారు. ఆయన నిజాయితీ నచ్చడంతో మేనేజర్ పోస్ట్ కి ప్రమోట్ చేశారు. అనంతరం మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అసిస్టెంట్ మేనేజర్ గా జాయిన్ అయ్యి కొద్దిరోజులపాటు పనిచేశారు. పోసాని ముక్కుసూటిగా, కాస్త కోపంగా తన పైఅధికారులతో మాట్లాడుతుండటంతో అతన్ని తరచూ ట్రాన్స్ఫర్ చేసేవారు.

నిజానికి నాటకాలపై చిన్నతనం నుంచే పోసాని కృష్ణ మురళికి ఎంతో మక్కువ ఉండేది. ఆ మక్కువ తోనే ప్రైవేట్ జాబ్స్ చేయడం మానేసి సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. తెలుగు లిటరేచర్ లో ఏంఎ చేయడంతో అతన్ని చాలామంది గౌరవించేవారు. పరుచూరి బ్రదర్స్ వద్ద అసిస్టెంట్ గా జాయిన్ అయిన తర్వాత ఆయన సినిమా ప్రస్థానం మొదలయ్యింది. krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి ప్రతిభావంతుడే కాదు నిజాయితీ పరుడు అని పరుచూరి బ్రదర్స్ కి కొద్దిరోజుల్లోనే అర్థమైంది. దీనితో పరుచూరి బ్రదర్స్ అతడిని తమ ప్రియశిష్యుడిగా చేసుకున్నారు. అసిస్టెంట్ రచయితగా పోసాని ఇచ్చే సలహాలు, ఐడియాలు బాగా నచ్చడంతో పరుచూరిబ్రదర్స్ బాగా గౌరవం ఇచ్చేవారు. ఆ విధంగా తనలోని గొప్ప రచయితను బయటపెట్టిన krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి మెల్ల మెల్లగా సినిమా అవకాశాలు దక్కించుకోవడం ప్రారంభించారు.

గోకులం లో సీత, పవిత్రబంధం, శివయ్య వంటి చిత్రాలకు ఆయన రైటర్ గా పని చేశారు. కొంతకాలానికి కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. విలక్షణమైన నటుడిగా కూడా ఆయన తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి వారు పోసాని కృష్ణ మురళి వద్ద అసిస్టెంట్ రచయితలుగా పనిచేశారు. కొరటాల శివ.. పోసాని కృష్ణ మురళికి స్వయానా మేనల్లుడు అవుతారు. అయితే మేనల్లుడు మాత్రమే కాదు ఆయన కుమారుడు కూడా సినిమా ఇండస్ట్రీ లోనే కొనసాగుతున్నారు. అతని కుమారుడు పేరు ప్రజ్వల్ కాగా ఆయన లాస్ ఏంజలెస్ లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన కొరటాల శివ డైరెక్ట్ చేసిన భరత్ అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. కొద్ది సంవత్సరాల తర్వాత మంత్రిగారు మాటిచ్చారు అనే సినిమాకి ప్రజ్వల్ దర్శకత్వం వహించారు. మరి తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని రైటర్, డైరెక్టర్ గా తెలుగు చలనచిత్రరంగంలో విజయవంతంగా కొనసాగుతారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: