ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..టాలీవుడ్ ప్రముఖ హీరో యూత్‌ స్టార్‌ నితిన్‌ గతేడాది చాలా వరుస ప్లాపుల తరువాత "భీష్మ " సినిమాతో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. "చలో" ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నితిన్ కి కమ్ బ్యాక్ హిట్ ని ఇచ్చింది. ఇక భీష్మ తరువాత అదే ఊపులో ఏడాది గ్యాప్ తీసుకోని ఎన్నో అంచనాలతో హీరోగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో "చెక్" సినిమా చేశాడు.'భవ్య క్రియేషన్స్' బ్యానర్ పై వి. ఆనందప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రంలో హాట్ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ వంటి క్రేజీ భామలు హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 26న విడుదలైన ఈ చిత్రానికి…మొదటి షో నుండే పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ దానిని క్యాష్ చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యిందనే చెప్పాలి.ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోని ప్లాప్ అయ్యింది...


ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన వసూళ్లను సాధిస్తుంది.. ఇక ఇప్పటిదాకా ఈ సినిమా ఎంత వసూలు చేసిందంటే..'చెక్' చిత్రానికి రూ.16.10కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు రూ.16.60 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 8.29 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 8.31 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి సోమవారం ఈ చిత్రం కేవలం 0.53 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇప్పటివరకూ 50శాతం కూడా రికవరీ సాధించని ఈ చిత్రం ఇక బ్రేక్ ఈవెన్ కావడం కష్టమనే విషయం పూర్తిగా స్పష్టమవుతుంది. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: