ఇండస్ట్రీ ఎప్పుడూ సక్సెస్‌ వెంటే పరుగులు పెడుతుంది. ఫ్లాప్‌ వస్తే ఎంత పెద్దోళ్లనైనా సరే పక్కన పెట్టేస్తుంది. కొంతమంది స్టార్ డైరెక్టర్స్ ఇలాగే సైడ్ అయిపోయారు. ఈ బ్యాడ్‌ ఫేజ్ నుంచి బయటపడ్డానికి క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బరిలో దిగుతున్నారు.

ఒకానొక సమయంలో క్రిష్ణవంశీతో సినిమా చేస్తే చాలు, ఫ్యామిలీ హిట్ వస్తుందనే బజ్ ఉండేది. కానీ 'మహాత్మ' తర్వాత వచ్చిన వరుస ఫ్లాపులతో ఈ ఇమేజ్ కూడా పోయింది. కృష్ణవంశీ మార్కెట్‌ మొత్తం డౌన్ అయ్యింది. ఈ స్లంపు నుంచి బయటపడేందుకు  మరాఠి మూవీ 'నటసామ్రాట్'ని రీమేక్ చేస్తున్నాడు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ లీడ్‌రోల్స్‌లో 'రంగమార్తాండ' పేరుతో వస్తోందీ సినిమా.

'మనసంతా నువ్వే, నేనున్నాను' సినిమాల టైమ్‌లో వి.ఎన్‌.ఆదిత్య ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నాడు. అయితే ఆ తర్వాత ఆదిత్య డైరెక్ట్‌ చేసిన 'రెయిన్‌ బో, రాజ్, ముగ్గురు' లాంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. తర్వాత వి.ఎన్.ఆదిత్య కూడా స్లో అయ్యాడు. అయితే మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి సునీల్‌తో 'మర్యాద క్రిష్ణయ్య' అనే సినిమా తీస్తున్నాడు.

చిన్న సినిమాలతో భారీ హిట్స్‌ అందుకోవడంలో తేజ స్పెషలిస్ట్. పైగా ఈ డైరెక్టర్‌తో సినిమా చేస్తే హీరోల ఇమేజ్‌ మారుతుందనే టాక్ కూడా ఉంది. అయితే చాన్నాళ్లుగా తేజ ప్రేమకథలు బోల్తా పడుతున్నాయి. 'నేనే రాజు నేనే మంత్రి'తో లైన్‌లోకి వచ్చిన తేజ, 'సీత'తో మళ్లీ ఫ్లాపుల్లోకి వెళ్లిపోయాడు. ఈ బ్యాడ్‌ ఫేజ్‌ని ఎదుర్కోవడానికి మూడు సినిమాలు లైన్‌లో పెట్టాడు తేజ.
స్పాట్: 'సీత' కోయిలమ్మ సాంగ్

తేజ చాన్నాళ్ల క్రితమే 'రాక్షసరాజు రావణాసురుడు, అలిమేలు మంగ వేంకటరమణ' సినిమాలు అనౌన్స్‌ చేశాడు. ఇక ఈ మూవీస్‌ సెట్స్‌కి వెళ్లకముందే రీసెంట్‌గా 'చిత్రం' సీక్వెల్ 'చిత్రం 1.1' ప్రకటించాడు తేజ. మరి ఈ మూవీస్‌తో తేజ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడేమో చూడాలి. మొత్తానికి మళ్లీ ఫామ్ లోకి రావడానికి హీరోలు ఆరాటపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: