పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ తన రేంజ్ రోజురోజుకీ పెంచుకుంటూ వెళ్తున్నాడు. వరసగా భారీ బడ్జెట్ సినిమాలని ఒప్పుకుంటు ప్రభాస్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరో గా మారాడు. ఇక ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాకి  రాధ కృష్ణ  దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ లాగా భావించే యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా పూజ హెడ్గే నటిస్తుంది. డియర్ కామ్రడ్ సినిమాకి సంగీతం అందించిన జస్టిన్ ప్రభాకరన్ రాధే శ్యామ్ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్ కి  విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. లైలా మజ్ను , పారు దేవదాస్ లాంటి అధ్బుతమైన ప్రేమ కావ్యంగా రాబోతున్న ఈ రాధే శ్యామ్ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది.అలాగే మొన్న ప్రేమికుల రోజున విడుదలైన టీజర్ కి కూడా భారీ ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అయితే వరసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్ ప్రస్తుతం ముంబై లో ఇల్లు కోసం వెతుకుతున్నారట. ఇక ఆయన అక్కడే ఉండబోతున్నారు అని టాక్ నడుస్తుంది. బాలీవుడ్ లో ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో అందరికి తెలిసిందే. ఆయన  చివరి చిత్రం సాహో సినిమాకి టాక్ అంత బాలేకపోయిన అక్కడ సూపర్ కలెక్షన్స్ సృష్టించింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ డైరెక్ట్ బాలీవుడ్ సినిమా చేస్తున్నారు. అదే అధిపురుష్ సినిమా. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో వరసగా సినిమాలు చేయడం మొదలుపెడతారు అని టాక్ నడుస్తుంది. ఇక ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా పూర్తి చేసి సలార్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ అధిపురుష్ సినిమాని మొదలుపెడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: