ఈ మధ్యకాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది యువ హీరోలు చిన్న సినిమాలతోనే తెరపైకి వచ్చినప్పటికీ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా చిన్న సినిమాతో తెర మీదికి వచ్చి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుని  ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు నవీన్ పోలిశెట్టి. నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం జాతిరత్నాలు. నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది అనే విషయం తెలిసిందే.



 ప్రేక్షకులందరికీ ఫుల్ టైం కామెడీ పంచేందుకు  సిద్ధమైన ఈ సినిమా. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తుతం చిత్రబృందం బిజీబిజీగా ఉంది. ఇకపోతే ఇటీవలే జాతిరత్నాలు చిత్రబృందం ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమానికి ప్రమోషన్స్ కోసం వచ్చింది ఈ క్రమంలోనే ఎంట్రీ తోనే తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు నవీన్ పొలిశెట్టి.  ఇక పోతే ఇక కామెడీ గా  తనదైన రీతిలో పంచులు వేస్తూ అందరిని ఆకర్షించాడు అనే చెప్పాలి.  ఇక తన స్పాంటినిటీ  కి జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు అటు జబర్దస్త్ జడ్జీలు కూడా ఫిదా అయిపోయారు.




 ఈ క్రమంలోనే అదిరే అభి స్కిట్స్ చేస్తున్న తరుణంలో ఇక నవీన్ పొలిశెట్టి తనదైన శైలిలో ఒక పంచ్  వేస్తాడు. రోజా మాట్లాడితే నవీన్ పోలిశెట్టి కి కామెడీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎంతగానో ఉంది అంటూ చెబుతుంది ఈ క్రమంలోనే ఒక్కసారి క్లోజ్  వేసుకోండి.. మా వాచ్ మెన్ శంకర్ పొద్దున పాల ప్యాకెట్ తీసుకు రమ్మని చెప్పిన కూడా వెళ్ళడు అంటూ పంచ్  వేస్తాడు నవీన్. ఆ తర్వాత మీరు హిందీలో కూడా బాగా యాక్టింగ్  చేస్తారు అంటూ అభి  చెప్పడంతో.. మా పనమ్మాయి యాదమ్మ కి ఈ డైలాగ్ ఒకసారి క్లోజ్  చేసుకోండి అంటూ చెప్పడంతో అందరూ నవ్వుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: