టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది హీరోలు తమ స్టార్ స్టేటస్ తో ముందుకెళ్తున్న విషయం తెలిసిందే.. ఇక వెండితెరకి కి మెగాస్టార్ ఎవరంటే చిరంజీవి అని.. పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ అని ఏ చిన్న పిల్లాడ్ని అడిగిన చెప్తారు..మరి కేవలం వెండితెరకె మెగాస్టార్, పవర్ స్టార్లు ఉంటారా.. బుల్లితెరపై ఉండరా..? అంటే కచ్చితంగా ఉంటారు.. కాకపోతే ఈ విషయం చాలామందికి తెలియదు.. మరి మన బుల్లితెరపై మెగాస్టార్ అని ముద్ర వేసుకున్న నటుడు మరెవరో కాదు.. ఆయనే సీరియల్ నటుడు ప్రభాకర్.. బుల్లితెరపై చాణిక్య, ఋతురాగలు అనే సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు ఇప్పుడు బుల్లితెర పై ఫుల్ బిజీగా గడుపుతున్నాడు.. కేవలం సీరియల్స్ లోనే కాదు.. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించాడు..అప్పట్లో ఈటీవీ క్రియేటివ్ మేనేజర్ గా, ఈటీవీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా కొన్ని సంవత్సరాల పాటు పనిచేశారు.. అయితే మధ్యలో రామోజీరావకి, ప్రభాకర్ కి మధ్య కొన్ని గొడవలు జరగడంతో ఈటీవీ నుండి ప్రభాకర్ ని తీసివేశారు.. ఇక  ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న మూడు ముళ్ల బంధం, వదినమ్మ, ముద్దుబిడ్డ, అన్న చెల్లెలు.. ఇలా పలు సీరియల్స్ తో బిజీగా ఉన్న ఇతను తన డిగ్రీ క్లాస్ మేట్ అయిన మలైక అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు..అయితే తన భార్య అంటే తనకు ఎంత ప్రేమో చెప్తూ.. తను వేరే అమ్మాయితో  తన భార్య చూసి బాధపడుతుందని తెలిసి.. సీరియల్స్ లో రొమాంటిక్ సీన్స్ ఉన్న రోజు పవర్ కట్ చేయడం, ఇంట్లో వాళ్ళని సినిమాకి తీసుకెళ్లడం లాంటివి చేస్తుంటానని చెప్పుకొచ్చాడు.. ఎందుకంటే తనని బాధ పెట్టడం ప్రభాకర్ కి నచ్చదట.. తను బాధ పడకుండా ఉండడానికి సీరియల్స్ లో నటించేటప్పుడు నటీ నటుల మధ్య ఏ విధమైన సంబంధం ఉండదని తెలియజేయడానికి ఆమెను షూటింగ్ లోకి తీసుకెళ్తాడాట.. అప్పటి నుండి తన భార్య సీరియల్స్ కూడా చూసి బాధపడటం మానేసిందని చెప్పాడు.. ఇదిలా ఉంటె అప్పట్లో తాను ఒకరితో సంబంధం పెట్టుకున్నట్లు వార్తలు బాగానే వచ్చాయని.. కానీ తను మాత్రం నమ్మలేదని.. నేనంటే తనకు అంత నమ్మకం అని తన భార్య గురించి ప్రభాకర్ చెప్పుకొచ్చాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: