టాలీవుడ్ లో అత్యధికంగా హీరోలు ఉన్న కుటుంబం మెగా ఫ్యామిలీ అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ కుటుంబం నుండి ఇప్పటికే ఎనిమిది మంది హీరోలుగా రానిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరిలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాత్రం కెరియర్ మొదటి నుండి కూడా డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు.

ప్రస్తుతం వరుణ్ తేజ్ వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఫిదా, తొలిప్రేమ, ఎఫ్2, గద్దలకొండ గణేష్,వంటి చిత్రాలతో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈ హీరో బాక్సింగ్ నేపథ్యంలో సాగే " గని " చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్2 సిక్వల్ ఎఫ్3 లోనూ నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా వరుణ్ తేజ్ మళ్ళీ లవ్ స్టోరీస్ పై ఆసక్తి కనబరుస్తున్నడని వార్తలు వస్తున్నాయి.

అందుకోసం భీష్మ సినిమాతో తన ఖాతాలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న వెంకీ కుడుముల ఇప్పటికే వరుణ్ తేజ్ కు మంచి ఫిల్ గుడ్ లవ్ స్టోరీ వినిపించడాని సమాచారం. ఆ కథ వరుణ్ కి కూడా బాగా నచ్చిందని తెలుస్తోంది. మరి ఈ వార్త పై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికి వీరిద్దరి కాంబినేషన్ పై మాత్రం ఫిల్మ్ సర్కిల్స్ లో విపరీతంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదివరకు వెంకీ కుడుముల మెగాస్టార్ చిరంజీవి కి కూడా కథ వినిపించారని, ఆ కథ చిరుకు కూడా నచ్చిందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత వీరి కాంబినేషన్ పై ఎలాంటి అప్డేట్స్ రాలేదు. అలాగే మళ్ళీ ఇప్పుడు వరుణ్-వెంకీ కుడుముల కాంబినేషన్ లో మూవీ అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. మరి వీటిలో నిజమెంతో తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: