టాలీవుడ్ లో నందమూరి బాలక్రిష్ణకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. బాలయ్యకు ఎన్ని ఫ్లాపులు అయినా రానీ కానీ ఒక్క ఫుల్ మీల్స్ లాంటి మాస్ మూవీ పడితే చాలు టాప్ రేంజి పొజిషన్ కొన్నేళ్ళ పాటు చెక్కు చెదరదు. అలాగే బాలయ్య తన నాలుగు దశాబ్దాల కెరీర్ ని కొనసాగిస్తున్నారు.

బాలయ్య ప్రస్తుతం బోయపాటి మూవీని చేస్తున్నారు. సింహా, లెజెండ్ తరువాత ఇద్దరికీ ఇది  హ్యాట్రిక్ మూవీ. ఈ మూవీ తరువాత బాలయ్య చేసే మూవీ ఏంటి అన్నది ఆయన ఫ్యాన్స్ లో ఆసక్తికరమైన చర్చగా ఉంది. బాలయ్య బి గోపాల్ అని వినిపించినా ఇపుడు అది వర్కౌట్ అయ్యేలా లేదుట. ఎందుకంటే కధ ఇంకా సెట్ కాలేదని అంటున్నారు. ఇక బాలయ్యతో ఎవరు మూవీ చేస్తారు అని చూసుకుంటే రీసెంట్ గా క్రాక్ మూవీతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని తో బాలయ్య మూవీ ఉంటుందని అంటున్నారు.

బోయపాటినే మించేలా మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ తో నిజంగా గోపీచంద్ క్రాకెత్తించాడు అంటున్నారు. బాలయ్య లాంటి పక్కా మాస్ హీరో కనుక ఆయన చేతిలో పడితే ఈ ఇద్దరూ కలసి చేసే మ్యాజిక్ కి  థియేటర్లు ఊగాలి. ఫ్యాన్స్ కి పూనకాలే రావాలి అంటున్నారు. ఇక బాలయ్యతో మైత్రీ మూవీ మేకర్స్ సినిమా తీయాలని చాలాకాలంగా అనుకుంటోంది.

ఇపుడు ఈ ఇద్దరి కాంబోను కలిపేందుకు మైత్రీ మూవీస్ రెడీ అయిందని టాక్. అయితే ఈ మూవీ విషయంలో మాత్రం ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్ రావాలి అంటున్నారు. ఒకవేళ బాలయ్య గోపీచంద్ కాంబో ఫిక్స్ అయితే మాత్రం ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అంటున్నారు. ఈ మూవీ కూడా పక్కా మాస్ గా ఉంటుందని కూడా చెబుతున్నారు. నిజంగా ఈ కాంబో సెట్ అయితే మాత్రం బాలయ్య కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని రాసేసుకోవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: