రాంగోపాల్ వర్మ అంటే తెలియని వారంటూ సినీ ఇండస్ట్రీలో , ప్రేక్షకులలో ఎవ్వరూ ఉండరు. అంతలా పాపులర్ అయ్యారు రాంగోపాల్ వర్మ. కంగనా రనౌత్ రాంగోపాల్ వర్మ ఇద్దరు ఇద్దరే. వీరు మాత్రం ఫిల్టర్ లేకుండా ముక్కుసూటిగా తమ ఉపన్యాసం ట్వీట్ చేస్తూ ఉంటారు. ఆర్జీవి లేటెస్ట్ గా ఫైర్ బ్రాండ్ కంగనారనౌత్ కు క్షమాపణలు తెలిపారు. తెలంగాణ టైటిల్ రోల్ పోషిస్తున్న 'తలైవి' విడుదలయ్యాక ప్రశంసల వర్షం కురిపించారు.

రామ్ గోపాల్ వర్మట్విట్టర్ హ్యాండిల్ ద్వారా..హే.. కంగనా..కొన్ని విషయాలు నేను మీతో వ్యతిరేకిస్తాను. కాని సూపర్ డూపర్ 'తలైవి 'స్పెషల్ చూశాక మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అందుకే మీకు నేను సెల్యూట్ చేస్తున్నాను అంటూ స్వర్గం నుంచి జయలలిత కచ్చితంగా థ్రిల్ అవుతుంటారు అని రాసుకొచ్చారు.

ఈ ట్వీట్ కు కంగనారనౌత్ రిప్లై ఇచ్చింది.
" సార్ ఏ  విషయంలోనూ నేను మీతో వ్యతిరేకించను. మీరంటే నాకిష్టం. మిమ్మల్ని ఎప్పుడూ మెచ్చుకుంటాను. ఇగోలు, గర్వాలు చాలా ఈజీగా హర్ట్ అయ్యి, ఈ విపరీతమైన సీరియస్ ప్రపంచంలో నేను మిమ్మల్ని మెచ్చుకుంటాను. ఎందుకంటే  సార్ మీరు దేనిని సీరియస్  గా తీసుకోరు. మీ కాంప్లిమెంట్ కు థాంక్యూ"  అని ఆమె ట్వీట్ చేసింది.

అంతేకాకుండా ఆమె రిప్లై ప్రతిస్పందించి ఆర్జీవి' మంచిది కంగానా'... స్ట్రాంగ్ ఒపీనియన్ తో ఉండే వాళ్ళు ఎవరైనా తీవ్రమైన రియాక్షన్ కు గురి అవుతుంటారు. హాలీవుడ్ కు చెందిన గొప్ప యాక్టర్ల తో మిమ్మల్ని కంపేర్ చేసినప్పుడు చాలా ఎక్కువ చేస్తున్నారని నేను ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు నేను అపాలజీ చెప్తున్నాను. అంతే కాదు, మీలాంటి పర్సనాలిటీ ఉన్న నటి వరల్డ్ లోనే లేదనే విషయం 100% అంగీకరిస్తాను అని రాశారు.  ఇప్పుడు ఇద్దరి సంభాషణ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తమిళనాడు మాజీ మంత్రి దివంగత జయలలిత గారి బయోపిక్ గా రూపొందుతున్న "తలైవా" ఏప్రిల్ 23న విడుదల అవుతోంది. ఈ చిత్రం ఎంతో ఘనవిజయం సాధించాలని అందరం కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: