గీతా గోవిందం తర్వాత అటు వెంటనే డియర్ కామ్రేడ్.. ఆ తర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో అవకాశం దక్కించుకుంది ఇక ఈ అమ్మడు. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ అమ్మడికి తిరుగులేకుండా పోయింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత 2020 సంవత్సరానికి గాను నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా కూడా రష్మిక ఎంపిక కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం తెలుగు తమిళ కన్నడ సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే హీరోయిన్ కావడానికి మరో హీరోయిన్ కారడం అన్న ఒక టాక్ ప్రస్తుతం టాలీవుడ్ లో వైరల్ గా మారిపోయింది.
రష్మిక మందన్న కెరీర్ మలుపు తిరగడానికి గీత గోవిందం సినిమా అసలు కారణం అనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా చిత్ర బృందం రష్మిక మందన ను అనుకోలేదట. లావణ్య త్రిపాటి ని ముందుగా హీరోయిన్ గా అనుకున్నారట. ఇటీవల ఓ ఈ విషయం చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాటి. ఇక అప్పటికే గీత ఆర్ట్స్ బ్యానర్ లో బలే బలే మగాడివోయ్ శ్రీరస్తు శుభమస్తు సినిమా యాక్ట్ చేయడంతో ఇక గీతా గోవిందం సినిమాలో హీరోయిన్గా ముందుగా తనను మేకర్ సంప్రదించారని అప్పటికే తన కమిట్మెంట్స్ కారణంగా ఆ మూవీ చేయలేక పోయాను అంటూ చెప్పుకొచ్చింది లావణ్య త్రిపాఠి. ఇక ఆ తర్వాత ఇక ఈ సినిమా కోసం రష్మిక మందన ఎంపిక చేశారు అంటూ తెలిపింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి