టిక్ టాక్ భార్గవ్ పేరు ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తుంది. మైనర్ బాలిక పై అత్యాచారం కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.ఫేమస్‌ చేస్తానని, చాన్సులు ఇప్పిస్తానంటూ మైనర్‌ బాలికపై అత్యాచారం చేశాడు. చెల్లీ అంటూనే ఆమె బతుకును నాశనం చేశాడు. దీనిపై విశాఖపట్నం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్‌ చేశారు. ఇక ఈ విషయం దావానంలా వ్యాపించగా అతడి చేతిలో మోసపోయింది ఈవిడే అంటూ పలువురు పేర్లు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో వారు ఆ బాధితురాలిని నేను కాదంటూ వీడియోలతో క్లారిటీ ఇచ్చారు.


కాగా, భార్గవ్ అసలు బండారాన్ని తన రూమ్ మెట్స్, మాజీ ప్రేయసి బట్ట బయలు చేశారు.అతడో పెద్ద వుమెనైజర్‌ అని బాంబు పేల్చింది. "నేనే తోపు, చెడ్డపనులు చేసినా నడుస్తది. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ టిక్‌ ఉంది, సౌత్‌ ఇండియా సూపర్‌ స్టార్‌. నేనేం చేసినా ఎవరూ ఏం చేయలేరు అని ఫీలవుతాడు. పని వర్కవుట్‌ అవకపోతే సెంటిమెంటల్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తాడు. ఏడ్వడం, చేతులు కట్‌ చేసుకోవడం, దాన్ని వీడియోలు చేయడం.. అంతా పబ్లిసిటీ స్టంట్‌.. ఇదంతా యాక్టింగ్‌. ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తాడు.. అలాంటి సినిమాలు ఎక్కువగా చూసేవాడు.. కానీ అలాంటి వాడు అంటే ఒప్పుకోడు.. 


భార్గవ్‌తో కలిసి వీడియోలు చేసిన సయ్యద్‌ సుమయ ఫరాహత్‌ కూడా తాజాగా ఓ వీడియో రిలీజ్‌ చేసింది. "భార్గవ్‌ను మొదట్లో మంచివాడు అనుకునేదాన్ని. కానీ అతడు వేరే అమ్మాయిలతో చేసే పనులు చూశాను. అవి నాకు నచ్చలేదు. నాకిక్కడ రక్షణ లేదనిపించింది. అందుకే గతేడాది అతడి టీమ్‌ వదిలి వెళ్లిపోయాను. కెమెరా ముందు ఒకలా, కెమెరా వెనకాల మరోలా ఉంటాడు. తన ఆటిట్యూడ్‌ నచ్చేది కాదు. అమ్మాయిలను అసలు గౌరవించెవాడు కాదు.. అందుకే నేను అతని టీమ్ నుంచి బయటకు వచ్చాను అని చెప్పుకొచ్చింది. అతని లిస్ట్ లో చాలా మంది మోసపోయిన సంగతిని పోలీసులు బయట పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: