ప్రస్తుతం
సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా అరంగేట్రం చేస్తున్న బడాబాబులు అందరూ ఇంగ్లీష్ కాన్వెంట్
స్కూల్ లో చదువుకొని వచ్చినవారే. కొందరు హీరోలైతే విదేశాల్లో చదువుకుని కంటిన్యూస్ గా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుంటారు. ఐతే వారిలో స్వచ్ఛమైన తెలుగు అర్థం చేసుకునే వారు చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పాలి. అందుకే దర్శకులు నేటి హీరోలకు ఇంగ్లీష్ లోనే
సినిమా కథలను నారేట్ చేస్తుంటారు. నేటి కాలంలో, తెలుగు డైలాగులను ఇంగ్లీష్ అక్షరాలలో రాసి హీరోల చేత చెప్పించే పరిస్థితి వచ్చిందంటే అతిశయోక్తి కాదు. కానీ
హీరో దగ్గుబాటి రానా కి మాత్రం ఇంగ్లీషులో డైలాగ్స్ రాసే వారన్నా.. ఇంగ్లీషులో కథ చెప్పే దర్శకులన్నా పిచ్చి కోపమట.
హీరో రానా తనకు ఇచ్చే డైలాగులు, స్క్రిప్ట్ అంతా కూడా అచ్చమైన తెలుగులో ఉండాలని దర్శకులకు ముందే చెప్తారట. కానీ డైలాగులు గాని స్క్రిప్ట్ గాని ఇంగ్లీష్ లో కనిపిస్తే తనకి పట్టరాని కోపం వస్తుందట. తాజాగా ఈ విషయాన్ని ఒక
డైరెక్టర్ బయటపెట్టారు. ప్రస్తుతం
రానా వేణు ఉడుగుల తో కలిసి విరాటపర్వం
సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని
రానా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రానాకి మాతృభాషపై అమితమైన
ప్రేమ ఉందని వేణు చెప్పుకొచ్చారు.
"దర్శకుడు ఎలా చెప్తే అలా నటించడానికి.. డైలాగులు చెప్పడానికి..
రానా రెండో ఆలోచన లేకుండా సిద్ధమవుతారు. స్క్రిప్ట్ విషయంలో దర్శకుడికి
రానా అసలు ఎదురు చెప్పరు. విరాటపర్వం
సినిమా షూటింగ్ ప్రారంభం దశలో మేము
రానా కి ఇంగ్లీష్ అక్షరాలతో రాసిన తెలుగు డైలాగులను ఇచ్చాము. ఆ ఇంగ్లీష్ అక్షరాలు చూసిన క్షణమే
రానా దగ్గుబాటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు భాష తనకు బాగా వచ్చునని.. తెలుగులోనే డైలాగులు రాసి ఇవ్వాలని
రానా చెప్పారు.
రానా కి మాతృ భాష పై ఎంత
ప్రేమ ఉందో ఆ క్షణమే నాకు అర్థం అయింది," అని దర్శకుడు వేణు ఉడుగుల చెప్పుకొచ్చారు.