తెలుగు సినిమా చరిత్రను ఒక్కసారి కనుక గమనిస్తే ఎంతో గర్వంగా ఉంటుంది. ఎంతో మంది తెలుగు సినిమా కళామ తల్లి సేవలో తరించారు. తెలుగు సినిమాను పునీతం చేయడానికి తమ టాలెంట్ ని పెట్టుబడిగా పెట్టారు. తెలుగు సినిమా జెండాను దిగంతాలకు అవతల ఎగరేశారు.

ఒక మల్లీశ్వరి మాయాబజార్, లవకుశ, గుండమ్మ కధ, శంకరాభరణం లాంటి సినిమాలతో పాటు ఊరమ్మడి బతుకులు, ఈ చరిత్ర ఏ సిరాతో, ఈ చదువులు మాకొద్దు అంటూ వర్తమాన సమాజాన్ని ప్రతిబింబించే ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇవన్నీ కూడా లో బడ్జెట్ లో వచ్చి ఎక్కువ కలెక్ట్ చేశాయి. ఇక సమాజానికి మంచి సందేశాన్ని కూడా ఇచ్చాయి.  70లలో వచ్చిన భూమికోసం అన్న సినిమా తీసుకున్నా ఇలాంటి సందేశమే ఉంటుంది.

చాలా మంది న్యూ టాలెంట్ కూడా ఇలాంటి సినిమాల ద్వారా వెలుగులోకి వచ్చారు. ఇక కొత్త టెక్నీషియన్లు కూడా తమ  ప్రతిభకు పదును పెట్టుకున్నారు అంటే ఇలాంటి సినిమాల ద్వారానే. నిజానికి ఈ జానర్ గత కొన్నేళ్ళ నుంచి మెల్లాగా తగ్గిపోయి ఇపుడు కనుమరుగు అయిపోయింది. తెలుగు  సినిమాలో ఈ జానర్ కూడా అతి ముఖ్యమే. ఆర్ నారాయణమూర్తి లాంటి వారు ఇంకా ప్రయత్నం చేస్తున్నా గతంలోలా వెల్లువలా మాత్రం సినిమాలు రావడంలేదు.

దానికి కారణం సినిమా మీద మోజు జనాలకు తగ్గిపోవడం ఒకటైతే  మరో వైపు  సినిమా విడుదలకు ఎన్నో అవాంతరాలు కూడా ఈ జానర్ మీద ఎవరికీ కన్నెత్తి చూసే సాహసం చేయలేకపోతోంది. ఇక కరోనా తరువాత చూసుకుంటే సినిమా బతికి బట్టకడుతుందా అన్న చర్చ అయితే వస్తోంది. దాంతో సినిమా అంటే కేవలం కమర్షియల్ లుక్ మాత్రమే అన్న భావం ఏర్పడిపోయింది. జనాలు కూడా ఆ తరహా మూవీస్ నే ఆదరిస్తున్నారు. థియేటర్లు వాటికే దొరుకుతున్నాయి. దాంతో రానున్న రోజుల్లో మేసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ అన్నవి ఇక ఉండవు అన్న మాట అయితే ఉంది. అదే జరిగితే మాత్రం సమాజానికే అతి పెద్ద నష్టం. ఎందుకంటే సినిమా కేవలం వినోదం మాత్రమే కాదు, బలమైన మీడియా కూడా.



మరింత సమాచారం తెలుసుకోండి: