టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్ జోడీలపై అభిమానుల్లో ఎప్పుడు ఆసక్తి కొనసాగుతూనే ఉంటుంది. అలాంటి బెస్ట్ కాంబినేషన్ జోడిలా జాబితాలో మహేష్ బాబు - సమంత జోడీ తప్పకుండా ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్ లో మొట్టమొదటిసారిగా 2011లో " దూకుడు " మూవీ వచ్చింది. ఈ సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మహేష్ - సమంత జోడీ అభిమానుల్లో ఫ్రెష్ పెయిర్ గా నిలిచింది. మహేష్ తో సరిపోయే హైట్ లేనప్పటికి సమంత తన క్యూట్ లుక్స్ తో పర్ఫామెన్స్ పరంగా మహేష్ కు బెస్ట్ జోడీ గా నిలిచింది.

ఇక ఈ సినిమా ఘన విజయం సాధించడంతో సమంత స్టార్ హీరోయిన్స్ జాబితాలోకి చేరిపోయింది. ఇక ఈ సినిమా తరువాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన " శీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు " సినిమాలో మహేష్ సమంతా జోడీ మరొకసారి అభిమానులను అలరించింది. ఈ సినిమాలో మహేష్ మరదలుగా సమంత చేసిన చిలిపి అల్లరి సినీ అభిమానులు అంతా తేలికగా మర్చిపోలేరు. ఇక ఈ సినిమా తరువాత ఆడియన్స్ లో ఈ ఇద్దరి జోడీపై స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. దాంతో ఈ జోడీని మళ్ళీ రిపీట్ చేసేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేసినప్పటికీ కుదరలేదు.

 అయితే " సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు " సినిమాలో మహేష్ - సమంతను బావ మరదలుగా చూపిన శ్రీకాంత్ అడ్డాల మళ్ళీ వీరిద్దరిని " బ్రహ్మోత్సవం " సినిమాలో ముచ్చటగా మూడవసారి బెస్ట్ జోడీగా నిలిపాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఇక ఆ తరువాత సమంతకు అక్కినేని నాగ చైతన్యతో వివాహం జరిగిన తరువాత " రంగస్థలం " మినహా వరుసగా అన్నీ లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు సైన్ చేస్తూ వచ్చింది. దీంతో మహేష్ - సమంత జోడికి బ్రేకులు పడ్డాయి. అయితే ఈ ఇద్దరి జోడీపై ఇప్పటికీ కూడా ఆడియన్స్ లో స్పెషల్ క్రేజ్ అలానే ఉంది. మరి ముందు రోజుల్లోనైనా ఈ హిట్ పెయిర్ రిపీట్ అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: