సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరో హీరోయిన్లు కలిసి నటిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది.  అయితే ఎందుకో తెలియదు కానీ అటు ప్రేక్షకులు మాత్రం కొన్ని జోడిలకు ఎంతగానో ఫిదా అయిపోతు ఉంటారు. ఆ ఇద్దరి కాంబినేషన్ లో ఏదైనా సినిమా వచ్చింది అంటే ఆ సినిమాలు కూడా హిట్ అయి పోతూ ఉంటాయి.  ఇలా టాలీవుడ్ లో కొంతమంది జోడీకి ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పటికే టాలీవుడ్ లో ఎన్నో క్రేజ్ తెచ్చుకున్న జోడీలు ఉండగా  నేటి తరంలో మాత్రం టాలీవుడ్లో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న జోడి ప్రభాస్ అనుష్క జోడి అని చెప్పాలి.  ఈ జోడి ఎన్నిసార్లు సినిమాలు చేసిన ప్రేక్షకులకు మాత్రం బోర్ కొట్టదు.



 ఇప్పటికే వీరిద్దరూ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమలో బ్లాక్బస్టర్ విజయాలను సాధించాయి..  వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరి పోతుంది అందుకే వీరిద్దరినీ ప్రేక్షకులు చూశారు అంటే మురిసిపోతూ ఉంటారు. కేవలం సినిమాల్లో మాత్రమే కాదు అటు బయట కూడా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంతో బాగుంటుంది. బిల్లా సినిమా తో మొదటి సారి జోడి కట్టిన ప్రభాస్ అనుష్క ఆ తర్వాత మిర్చి సినిమాలో కలిసి నటించారు. ఇక అటు వెంటనే బాహుబలి రెండు పార్ట్ లలో  కూడా అనుష్క ప్రభాస్ కలిసి నటించారు. ఇలా వీరిద్దరూ నటించిన సినిమాలు అన్నీ కూడా బ్లాక్బస్టర్ విజయాలను సాధించాయి.




 అయితే ఇప్పటి వరకు వీరిద్దరు జోడి ని ఎన్నో సినిమాల్లో చూసిన ప్రేక్షకులు ఇప్పటికీ కూడా మరో సారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే బాగుండు అని కోరుకుంటున్నారు. ఇక ప్రస్తుతం జనరేషన్లో మాత్రం టాలీవుడ్ ప్రేక్షకులు అందరిని తమ వైపు తిప్పుకొని అందరిని ఆకట్టుకుంటూ తెగ క్రేజ్ సంపాదించుకున్న పర్ ఫెక్ట్ జోడీ అనుష్క ప్రభాస్ అని అంటున్నారు ప్రేక్షకులు. అంతేకాదు ఇద్దరి మధ్యలో లవ్ ట్రాక్ నడుస్తోందని వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారూ అన్న టాక్ కూడా వినిపించింది. ఇకపోతే  అభిమానులు కోరుకున్నట్లుగానే వీరిద్దరి కాంబినేషన్లో మరోసారి సినిమా వచ్చి అలరిస్తుందా   లేదా అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: