సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా ఉన్న తండ్రీకొడుకులు కలిసి నటించిన సినిమాలు చాలా ఉన్నాయి.. వారసుల హవా ఏ పరిశ్రమలో అయిన కొనసాగుతున్న విషయం తెలిసిందే.. అలానే టాలీవుడ్ లోనూ వారసుల హవా ఎక్కువైపోతుంది.. ఎవరి సినిమాలపై వారు దృష్టి పెట్టడమే కాకుండా కలిసి నటిస్తూ వారి వారి అభిమానులు కూడా ఖుషీ చేస్తున్నారు.. ఆ విధంగా మన టాలీవుడ్ లో తండ్రీ కొడుకులు కలిసి నటించిన సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. వారి అభిమానులు వారి వారి సినిమాలు చూడాలని తెగ ఆరాట పడుతుంటారు.. అక్కినేని నాగేశ్వరావు దగ్గర్నుంచి అక్కినేని అఖిల్ దాకా మొత్తం చాలా మంది హీరోలు ఈ ఫ్యామిలీ నుంచి రాగా, అక్కినేని ఫ్యామిలీ నటించిన మనం సినిమా ఆ కుటుంబానికి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది.. ఈ సినిమాలో తండ్రీ కొడుకులయినా నాగేశ్వరావు నాగార్జున, నాగార్జున నాగచైతన్య, నాగార్జున అఖిల్ లు కలిసి నటించడం విశేషం..

టాలీవుడ్ లో తండ్రీ కొడుకులు అయిన రామ్ చరణ్ తేజ్, చిరంజీవి కలిసి నటించిన సినిమా మగధీర మరియు ఆచార్య.. మగధీర లో చిన్న పాత్రలో కనిపించిన చిరంజీవి తన సినిమా ఆచార్యలో ఫుల్ లెన్త్ రోల్ తన కొడుకు ఇచ్చి వీరి కాంబినేషన్లో రాబోతున్న తొలి సినిమాగా ప్రకటించారు.. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొనగా చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.. చరణ్ సరసన పూజ హెగ్డే నటిస్తుంది. ఈ సినిమా కి రామ్ చరణ్ నిర్మాత అవడం విశేషం.. ఇకపోతే మంచు వారి ఫ్యామిలీ నుంచి రౌడీ సినిమా, సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు , రమేష్ బాబు నటించిన ముగ్గురు కొడుకులు సినిమా ఇలా తల్లిదండ్రులు కలిసి నటించిన చిత్రాలే..

మరింత సమాచారం తెలుసుకోండి: