టాలీవుడ్ ద‌ర్శ‌కుల్లో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు పూరీ జ‌గన్నాత్. బ‌ద్రి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పూరీ ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల‌ను తెర‌కెక్కించి టాప్ డైరెక్ట‌ర్ గా ఎదిగారు. అంతే కాకుండా దాదాపు 20 సంవ‌త్స‌రాలుగా పూరీ ట్రెండ్ కు త‌గ్గ‌ట్టుగా సినిమాలు తీస్తూ స‌త్తా చాటుతున్నారు. ఇక పూరి సినిమాల‌తోనే కాకుండా త‌న మాట‌ల‌తోనూ అభిమానులను ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటారు, ఇక పూరీ మాట‌ల‌కు అభిమానులు ఉండ‌టంతో ఆయ‌న పూరీ మ్యూజింగ్స్ పేరుతో ఓ యూట్యూబ్ ను మొద‌లు పెట్టి ప‌లు విష‌యాల గురించి చ‌ర్చిస్తున్నారు. కాగా తాజాగా పూరీ ఆయ‌న ఛాన‌ల్ ఓ ఇంట్రెస్టింగ్ విషయం గురించి చ‌ర్చించారు. రాజ ముడి బియ్యం గురించి పూరీ ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను తెలియ‌జేశారు. ఇక ఆ విష‌యాలంటే ఇప్పుడు చూద్దాం. ఇండియాలో మనంద‌రం సాధారణంగా తీసుకుకునే ఆహారం బియ్యం. ఒక‌ప్పుడు మ‌న దేశంలో బియ్యం దాదాపు ల‌క్ష ర‌కాల‌లో ఉండేది. కానీ ఇప్పుడు అవ‌న్నీ క‌నుమ‌రుగైపోయాయి. ప్ర‌స్తుతం మార్కెట్ కేవ‌లం ఆరువేల ర‌కాలు మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయి. 

వాటిలో రాజ‌ముడి బియ్యం కూడా ఒక‌టి. ఈ బియ్యం క‌ర్నాట‌క రాష్ట్రంలో ల‌భించేది. రైతులు పన్నులు క‌ట్టేందుకు బ‌దులుగా ఈ బియ్యాన్ని ఇచ్చేవారు. ఈ బియ్యం షుగ‌ర్ పేషెంట్ ల‌కు చాలా మంచింది. వీటిటి మూములు బియ్యంలా కుక్క‌ర్ లో కాకుండా ఎస‌రు పెట్టి వండాలి. ఆడవాళ్లకు పీరియ‌డ్ స‌మ‌యంలో హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ వ‌ల్ల తీవ్రంగా క‌డుపునొప్పి వ‌స్తుంది. అయితే ఈ బియ్యం తినడం వ‌ల్ల ఆ స‌మ‌స్య దూరమ‌వుతుంది. బియ్యం వండే ముందు వ‌డ‌పోసిన గంజిని తాగ‌టం వ‌ల్ల కూడా ఎన్నో లాభాలుంటాయి. అంతే కాకుండా రోగ నిరోధ‌క శ‌క్తిని మెరుగు ప‌రిచి ఎన్నో రోగాలు ధ‌రిచేర‌కుండా ఈ బియ్యం మంచి ఇమ్యునిటీ బూస్టర్ లా ప‌నిచేస్తుంది. అంటూ పూరిజ‌గ‌న్నాత్ రాజ ముడి బియ్యం గురించి చెప్పారు. ఇక గ‌తంలోనూ పూరి త‌న ఛాన‌ల్ ద్వారా ఎన్నో మంచి విష‌యాల‌ను షేర్ చేశారు. ఎలాంటి వారిని జీవిత భాగ‌స్వామిగా చేసుకోవాలి....భ‌యాన్ని ఎలా దూరం చేసుకోవాలి లాంటి యూత్ కు ఉప‌యోగ‌పడే వీడియోలు చేసారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: