ప్రముఖ దర్శకుడు రాజమౌళితో పని చేయాలంటే అంత ఈజీ కాదు. తన డైరెక్షన్‌లో సినిమా చేయాలంటే.. హీరోలు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అందరు దర్శకుల కంటే భిన్నంగా రాజమౌళి ఆలోచనలు ఉంటాయి. ఇతడి సినిమాలో హీరోల లుక్‌లనే ఛేంజ్ చేసేస్తారు. మీకు గుర్తే ఉంటుంది.. బహుబలి సినిమా కోసం ప్రభాస్, రానా పడిన పాట్ల గురించి. శరీర ఆకృతిని పెంచుకోవడాని, బాడీ ఫిటినెస్‌పై చాలా ఫోకస్ పెట్టారు. అలాగే ఆ సమయంలో ప్రభాస్ వేరే సినిమాలకు కూడా కమిట్ కాలేదు. రాజమౌళికి తగ్గట్లుగానే హీరోలు తమ నిర్ణయాలు మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకే సినిమాపై ఫోకస్ పెడుతూ భారీ సక్సెస్‌ను అందించడం రాజమౌళి స్పెషాలిటి.

అయితే ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తీస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ సినిమాలోని కొమురం భీం పాత్ర కోసం జూనియర్ ఎన్‌టీఆర్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. అయితే తాజాగా ఎన్‌టీఆర్.. ఆర్ఆర్ఆర్ సినిమాలో తన పాత్ర గురించి తెలిపారు. ఈ సినిమా కోసం అంతలా కష్టపడ్డానని చెప్పుకొచ్చారు. కొమురం భీం పాత్రలో తన లుక్ కోసం 18 నెలల పాటు కఠినమైన కసరత్తులు చేసినట్లు ఎన్‌టీఆర్ పేర్కొన్నారు. కొమురం భీం పాత్ర కోసం ఏకంగా 9 కేజీల మజిల్ బాడీని పెంచినట్లు తెలిపారు. దీనికి ఎంతో శారీరక శ్రమ చేయాల్సి వచ్చిందన్నారు. దీంతో ఎన్‌టీఆర్ అభిమాలు రాజమౌళిను తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్‌టీఆర్ మజిల్ బాడీని పెంచడానికి టార్చర్ పెట్టినట్లు వారు అభిప్రాయపడ్డారు.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నారని, అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా ఒప్పుకున్నట్లు ఎన్‌టీఆర్ తెలిపారు. ఎన్‌టీఆర్ దర్శకులను ఎంపిక చేసుకుంటున్న తీరును చూసి అభిమానుల్లో ఉత్కంఠత పెరుగుతోంది. ఈ సినిమాలు ఎలా ఉండబోతుందో అని వేచి చూస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఎన్‌టీఆర్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇప్పటికే హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స చేయించుకుంటున్నారు. ఎన్‌టీఆర్ కరోనా నుంచి తొందరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: