సినిమా హిట్టా ? ప్లాపా అనేది ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూలు చేసే కలెక్షన్స్ డిసైడ్ చేస్తాయి. కొన్ని సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా వసూళ్ళు బాలేకపోతే ఫ్లాప్ అనే  లెక్కగట్టాల్సి వస్తుంది. అలానే ఒక్కోసారి భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద చతికిలబడుతుంటాయి. టాలీవుడ్ లో కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలై అంచనాలు అందుకోలేక డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి, ఆ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం


1) అజ్ఞాతవాసి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 27 సినిమాల్లో చాలా ప్లాప్స్ ఉన్నప్పటికీ.. 'అజ్ఞాతవాసి' 'కొమరం పులి' సినిమాలు మాత్రం డిజాస్టర్స్ గా మిగిలాయని చెప్పవచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'అజ్ఞాతవాసి' భారీ అంచనాల మధ్య వచ్చి నిర్మాతకు భారీ నష్టాలను మిగిల్చింది. ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా చేసినా  50 కోట్లకు పైగా నష్టాలు తీసుకొచ్చింది.


2) స్పైడర్

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్లాప్ అయిన వాటిలో 'బ్రహ్మోత్సవం' 'స్పైడర్' సినిమాల గురించి చెప్పుకోవాలి.  మహేష్ - డైరెక్టర్ మురుగదాస్ కాంబోలో భారీ అంచనాలతో వచ్చిన 'స్పైడర్' మూవీ తమిళ్ లో ఓ మోస్తరుగా ఆడినప్పటికీ తెలుగులో డిజాస్టర్ అయింది. ఈ సినిమాకి దాదాపు 40 కోట్ల దాకా నష్టం వచ్చినట్లు ట్రేడ్ టాక్.


3) సర్దార్ గబ్బర్ సింగ్


పవన్ కళ్యాణ్ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. గబ్బర్ సింగ్ సినిమా సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాకి కూడా మంచి ప్రీ రిలీజ్ జరిగింది. కానీ సుమారు 50 కోట్ల దాకా నష్టాలను మిగిల్చింది ఈ సినిమా.


4) వన్ నేనొక్కడినే


మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా మహేష్ బాబు కెరీర్ లో భారీ డిజాస్టర్ సినిమాగా నిలిచింది. సుమారు 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ సుమారు యాభై కోట్ల నష్టం మిగిల్చింది ఈ సినిమా.


5) బ్రహ్మోత్సవం

మహేష్ బాబు కెరీర్ లో బ్రహ్మోత్సవం సినిమా కూడా భారీ డిజాస్టర్ గా నిలిచింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన 'బ్రహ్మోత్సవం' చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ సినిమా నిర్మాతలకు 35 - 40 కోట్ల మధ్య నష్టాలు తీసుకొచ్చిందని తెలుస్తోంది.


6) అఖిల్


అక్కినేని అఖిల్ లాంచింగ్ మూవీ అయిన ఈ సినిమాకు వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు. మొదటి సినిమానే అయినా స్టార్ కొడుకు కావడంతో భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. కానీ సుమారు 30 కోట్ల రూపాయల మేర ఈ సినిమా నష్టాలను మిగిల్చింది.


7) శక్తి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు చాలా ప్లాప్స్ ఉన్నప్పటికీ 'శక్తి' సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అప్పట్లోనే భారీ బడ్జెట్ తో రూపొందించారు. అయితే ఈ సినిమా పూర్తిగా నిరాశపరిచి భారీ నష్టాలను తెచ్చిపెట్టింది.


8) తుఫాన్
 ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో 'తుఫాన్' బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచింది. అపూర్వ లఖియా తెరకెక్కించిన ఈ సినిమాతో చరణ్ బాలీవుడ్ లో లాంచ్ అయ్యాడు. 'జంజీర్' రీమేక్ గా వచ్చిన ఈ సినిమా ఘోర పరిచయం చవిచూసింది.


9) రెబల్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో 'రెబల్' సినిమా డిజాస్టర్ అయింది. లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది.

10) కొమరం పులి
ఖుషి తర్వాత ఎస్.జె.సూర్య పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. కానీ ఈ సినిమా భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: