మెగాస్టార్ చిరంజీవి అంటే కేవలం సినిమాలలోనే  మెగాస్టార్ కాదు ఎంతో మంది జీవితాలలో పెద్దన్నయ్య లాగా మెగాస్టార్ గా చిరకాలంగా మిగిలిపోతారు. ఈ కరోనా విపత్కర సమయంలో కూడా ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఆక్సిజన్ సిలిండర్ లను, ఆర్థిక సహాయాన్ని అందించిన మెగా స్టార్ త్వరలోనే అంబులెన్స్ సిస్టం ను కూడా ఏర్పాటు చేయనున్నారు. చిరంజీవి ఇటీవల ,కరోనా నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో వివరించారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ చెప్పిన నియమాలు ఏంటో చూద్దాం.

కరోనాని జయించడం కోసం మనలో మనోధైర్యాన్ని నింపుతూ , చిరంజీవి ఒక వీడియోని సోషల్ మీడియాలో వదిలారు.అది కాస్త వైరల్ గా మారింది. ఆ వీడియోలో చిన్న పిల్లలతో కలిసి చాలా అద్భుతమైన నటన ప్రదర్శించారు అని చెప్పవచ్చు. చిరంజీవి చెప్పిన ఈ నియమాలు పాటించడం వల్ల కరోనాను మనం తప్పకుండా జయించగలము. ముఖ్యంగా, ఒక ప్రముఖ ఛానల్లో టీవీ యాడ్స్ కోసం చేశారు చిరు. గతంలో కూడా చిరంజీవిఇలాంటి ఒక వీడియో ద్వారా  కరోనాని నియంత్రించవచ్చని తెలిపారు.

కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో చాలా మంది ప్రజలు చనిపోయారు. అయితే ప్రస్తుతం కరోనా ఉదృత తగ్గుతున్నప్పటికీ, మనం ఏమాత్రం పొరపాటున నిర్లక్ష్యంగా ఉండవద్దని హెచ్చరిస్తున్నారు చిరంజీవి. అన్ని నియమాలను పాటిస్తూ మన పనులు మనం చేసుకోవడం మంచిది, కరోనా సోకిన వ్యక్తికి దూరంగా ఉండాలి కానీ దూరం పెట్టకూడదు అని అంటున్నారు ఆయన. అంతే కాకుండా మరి కొన్ని నియమాలను ఆయన తెలిపారు.

1). ప్రతి ఒక్కరూ  ఇంట్లో ఉండాలి.. అవసరం అనిపిస్తే తప్ప బయటికి రాకూడదు.

2). ప్రతి ఒక్కరు తమ చేతులను కనీసం 20 నుంచి 30 సెకన్లపాటు శుభ్రం చేసుకోవాలి.

3). దగ్గు వచ్చినప్పుడు, తుమ్ము వచ్చినప్పుడు కచ్చితంగా ముక్కుకు, నోటికి చెయ్యిలేదా గుడ్డ అడ్డు పెట్టుకోవాలి.

4). సోషల్ డిస్టెన్స ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా అది అవసరమని చిరంజీవి తెలిపారు.

5). కరోనా సోకిన వ్యక్తిని దూరంగా ఉంచండి.. కానీ దూరం పెట్టకండి.. వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనది.


మరింత సమాచారం తెలుసుకోండి: