సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది కొత్త హీరోలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ తెలుగు చిత్ర పరిశ్రమలో కొంతమంది హీరోలు మాత్రమే తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు టైం బాగా కలిసిరాక మొదట బాగా క్రేజ్ సంపాదించుకొన్నప్పటికీ ఆ తర్వాత మాత్రం ప్రేక్షకులను అలరించలేక చివరికి నిరాశ చెందుతూ ఉంటారు. ఇలాంటి టాలీవుడ్ హీరోలు లో మొదటగా వచ్చే పేరు వరుణ్ సందేశ్. వైవిధ్యమైన దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీ డేస్ అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన వరుణ్ సందేశ్ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు.




 ఇక హ్యాపీడేస్ తర్వాత కొత్త బంగారు లోకం అనే సినిమా వరుణ్ సందేశ్ కు మంచి బ్రేక్ ఇచ్చింది. యూత్ ఫుల్ సినిమా గా తెరకెక్కిన ఈ సినిమా అటు ప్రేక్షకులందరికీ ఎంతగానో కనెక్ట్ అయింది  అయితే ఈ సినిమా తర్వాత ఎన్నో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ వరుణ్ సందేశ్  మాత్రం విజయం సాధించలేకపోయాడు.  ఈ క్రమంలోనే గత కొన్నేళ్ల నుంచి అసలైన హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు ఈ హీరో.  అయితే అటు విజయానికి దూరం కావడమే కాదు సినిమా అవకాశాలు కూడా వరుణ్ సందేశ్ కి ఎంతో దూరం అయిపోయాడయ్.  దీంతో నిరాశ లో మునిగిపోయాడు వరుణ్ సందేశ్.



 అయితే ప్రస్తుతం ఊహించినదానికంటే సినిమా అవకాశాలు కాస్త తక్కువగా వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వరుణ్ సందేశ్ ఎంతగానో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.  ఎప్పటిలాగానే సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగాలా లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే బెటరా అనే ఆలోచనలో వరుణ్ సందేశ్ పడినట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలోనే సినిమాలు వ్యాపారం ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేక తెలియక వరుణ్ సందేశ్ ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్నాడట. ఇక త్వరలో దీనికి సంబంధించి ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని భావిస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: