కరోనా వైరస్ వచ్చిన నాటి నుంచి అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయ్.  ఇక అన్ని రంగాలు తీవ్రంగా కోలుకోలేని నష్టాన్ని చవిచూశాయి  అయితే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా పడిన రంగాలలో సినీ రంగం కూడా ఒకటి.  ఎప్పుడూ వరుస సినిమా షూటింగ్ లతో హడావిడితో ఉండేది సినీరంగంలో.  వరుస సినిమాలు విడుదలవుతు థియేటర్ల వద్ద ఇక సినీ ప్రేక్షకుల హంగామా మామూలుగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఇవేవీ కనిపించడం లేదు. ఇలాంటివి కనిపించి కూడా చాలా రోజులే అయింది.



 కరోనా వైరస్ తెలుగు లోకి వచ్చిననాటి నుంచి షూటింగ్స్ కూడా సరిగా జరగని పరిస్థితి.  కరోనా వైరస్ కేసులు తగ్గడంతో షూటింగ్ ప్రారంభం కావటం.. అంతలోనే మళ్లీ కేసులు పెరగడంతో ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చి చివరికి థియేటర్ లు మూతపడడం జరుగుతుంది. అంతేకాకుండా  సినిమా షూటింగులు కూడా ఆగిపోతున్నాయి. ఇక ముఖ్యంగా సినిమా థియేటర్లో నిర్వాహకుల పరిస్థితి అయితే ముందు గొయ్యి వెనుక నుయ్యి అన్న విధంగా మారిపోయింది.  సినిమాలు విడుదల చేసే అవకాశం లేకపోవడంతో థియేటర్లను మూసివేయాలేక..  మరోవైపు మంచి రోజులు వచ్చే అంతవరకు వేచి చూడ లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు సినిమా థియేటర్ల నిర్వాహకులు.



 ప్రేక్షకులు కూడా ఎప్పుడెప్పుడు సినిమా థియేటర్లు తెరుచుకుంటాయా అని ఎదురుచూస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో జులై 1వ తేదీ నుంచి సినిమా థియేటర్ తెరుచుకునే  అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సినీ ప్రేక్షకులు ఆనందంలో మునిగిపోతున్నారు. అయితే గతంలో తొలిదశ లాక్ డౌన్ సమయంలో 50 శాతం సీటింగ్ కెపాసిటీ తో అనుమతి ఇచ్చారు. ఇక ఇప్పుడు కూడా ఇలాగే అనుమతి ఇస్తారా లేదా పూర్తి స్థాయి థియేటర్లు ఓపెన్ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అటు ఏపీలో కూడా  కేసులు తగ్గుతూన్న నేపథ్యంలో థియేటర్ లు ఓపెన్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: