టాలీవుడ్ లో ఉన్న నటులలో ఎటువంటి పాత్రనైనా తనదైన శైలిలో నటించి, అందరిని మెప్పించిన ఏకైక వ్యక్తి ప్రకాష్ రాజ్. ఏ పాత్రలోనైనా సరే అద్భుతంగా ఒదిగిపోగల సత్తా ఉన్న ఏకైక నటుడు. ఈయన యూత్, తండ్రి పాత్ర,అన్న పాత్ర వంటి ఎన్నో పాత్రలలో నటించారు ప్రకాష్ రాజ్. కొన్ని సినిమాలలో వయసులో తనతో సమానంగా ఉన్న కొందరి హీరోలకు తండ్రి పాత్రలో నటించాడు. అంతేకాకుండా ప్రకాష్ రాజ్ కు ఏదైనా నచ్చకపోతే సూటిగా చెప్పే వ్యక్తి. అలాంటి విషయాలను సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్ట్ పెడుతుంటాడు ప్రకాష్ రాజ్. అయితే ఇప్పుడు ఆ సినిమాలు ఏంటో చూద్దాం.


1). అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి:ఈ సినిమాలో రవితేజ హీరోగా నటించారు. ఇందులో హీరో కు  తండ్రి పాత్రలో  నటించారు. ఇక ఇప్పుడు రవితేజ వయస్సు 52 సంవత్సరాలు. అలాగే వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో కూడా నటించారు.

2). అంతఃపురం:ఈ సినిమాలో సాయి కుమార్ కు ప్రకాష్ రాజ్ తండ్రి పాత్రలో నటించారు. ఇక ప్రస్తుతం సాయి కుమార్ వయస్సు 51 సంవత్సరాలు.

3). ప్రేమకు వేళాయరా :ఈ చిత్రంలో హీరోయిన్ సౌందర్య కు తండ్రిగా నటించారు ప్రకాష్ రాజ్. ఇక ప్రస్తుతం ఆమె బ్రతికి ఉండి ఉంటే, సౌందర్య వయస్సు 48 సంవత్సరాలు.

4). నువ్వొస్తానంటే నేనొద్దంటానా :నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం వంటి సినిమాలలో సిద్ధార్థకు తండ్రి పాత్రలో నటించాడు ప్రకాష్ రాజ్ .

5). ఇంద్ర :మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ హిట్ సినిమా ఇంద్రా లో హీరోయిన్ సోనాలి బింద్రే కు తండ్రి పాత్రలో నటించారు ప్రకాష్ రాజ్.

6). చూడాలని ఉంది:ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ అంజలా జవేరి  తండ్రిగా  నటించారు.

7). మహర్షి:
దూకుడు, మహర్షి ,  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలలో హీరో మహేష్ బాబు కి తండ్రిగా నటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: