తమిళ ఇండ్రస్టీ లో అగ్ర హీరోగా దూసుకుపోతున్నాడు ఇళయ దళపతి విజయ్.ఈ ఏడాది మొదట్లో ఈ హీరో నటించిన 'మాస్టర్' సినిమా బాక్సాఫీస్ వద్ద 200 ట్లు వసూలు చేసింది.తమిళంలో తో పాటుగా తెలుగులో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది.ఇక జూన్ 22 న ఈ హీరో తన పుట్టినరోజును జరుపుకోనున్నాడు.ప్రతీ సంవత్సరం తన పుట్టినరోజున తన కొత్త సినిమాలకు సంబంధించి వరుస అప్డేట్స్ ఇస్తూ.. ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చేవాడు.ఇక ఈ ఏడాది కూడా తాను నటించబోయే సినిమా అప్డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.ఇక ఇదిలా ఉంటె ప్రస్తుతం విజయ్..నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది.ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఓ షెడ్యూల్ ని ఈజిప్టు లో షూట్ చేశారు. ఇక ఆ తర్వాత కరోనా సెకండ్ వేవ్ విజృభించడంతో మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చేసింది మూవీ టీమ్.అయితే ఈ సినిమాకి 'టార్గెట్' అనే టైటిల్ ని చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు తాజా సమాచారం.అంతేకాదు విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది.ఇక ఈ సినిమాతో పాటుగా టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విజయ్.

అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమాని తెలుగుతో పాటుగా తమిళంలో అంటే ద్విభాషా చిత్రంగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.అయితే జూన్ 22 విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు సినిమాల నుంచి అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఇక అందుతున్న సమాచారం ప్రకారం విజయ్ పుట్టినరోజున నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకి సంబంధించి అప్డేట్ మాత్రం కచ్చితంగా ఉండనుందని సినీ వర్గాలు అంటున్నాయి.మరి ఆ అప్డేట్ ఏంటో తెలియాలంటే జూన్ 22 వరకు వేచి చూడాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: