ప్రస్తుతం సమాజంలో యువతీ యువకులు తెలిసీ తెలియని వయసులో ప్రేమించుకుంటుంటారు. అయితే యుక్త వయసు లో  ప్రేమించడానికి గల కారణం అట్రాక్షన్ అని చెప్పవచ్చు. కొంతమంది ప్రెస్టేజ్ కోసం లవ్ చేస్తే, మరికొంతమంది అట్రాక్షన్ తో లవ్ చేస్తూ ఉంటారు. ఇక ఈ జనరేషన్లో చిన్న పిల్లల సైతం లవ్ చేసుకున్న సందర్భాలు ఎన్నో చూసాము. లవ్ అనేది ఒక మధురానుభూతి. ఇక అలాంటి స్వచ్ఛమైన ప్రేమను మనకు కళ్ళకు కట్టినట్టు చూపించారు దర్శకులు. ఇక  ఇప్పుడు ఒక సినిమాని ఏకంగా ఎనిమిది భాషలలో రీమేక్ చేశారు. అందులో హీరోగా సిద్ధార్థ్, హీరోయిన్ గా త్రిష నటించింది. ఆ సినిమానే నువ్వొస్తానంటే నేనొద్దంటానా! అయితే ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..
ఈ సినిమాలో హీరో సిద్ధార్థ్ ఫారెన్ అబ్బాయి గా కనిపిస్తాడు. హీరోయిన్ త్రిష పల్లెటూరి అమ్మాయి గా కనిపిస్తుంది. ఇక ఇందులో శ్రీహరి కూడా త్రిష వాళ్ళ సోదరుడి పాత్రలో నటించాడు. శ్రీహరి గారి గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఎమ్.ఎస్. రాజుగారు ప్రభుదేవా దగ్గరకు వెళ్లి మీరు సినిమాని డైరెక్ట్ చేస్తారా ? అని అడిగా.. ప్రభుదేవా దాదాపుగా 8 యేళ్ళ  నుంచి డైరెక్ట్ చేయడానికి వేచి చూస్తున్నాడు. ఇక  దీంతో అవకాశం వచ్చిందని ప్రభుదేవా ఓకే చెప్పేసాడు. ఇక ఎమ్మెస్ రాజు గారు తన నెక్స్ట్ మూవీ ప్రభుదేవాతో అని అనౌన్స్ చేశారు. ఈ సినిమాలోని డైలాగ్స్"పరుచూరి బ్రదర్స్" రాయగా, ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రాజుగారు అందించారు. ఇక ప్రభుదేవా, వీరు పోట్ల సహాయంతో ఈ సినిమాని పూర్తి చేశారు.
ఇందులో హీరోయిన్ ని ముందుగానే త్రిషను అనుకున్నారు. అయితే హీరో కోసం వెతకగా ముందుగా ఉదయ్ కిరణ్ ను అనుకోగా , కానీ చివరికి ప్రభుదేవా "సిద్ధార్థ" పేరు చెప్పారు. ఈ సినిమాలో మెయిన్ రోల్ లో నటించిన ,హీరోయిన్ అన్న పాత్ర కోసం శ్రీహరి గారిని అడగగా, ఆయనb వెంటనే ఓకే చెప్పేశారట. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాకి ముందుగా రూ. 2 కోట్ల బడ్జెట్ అనుకోగా, సినిమా పూర్తి అయ్యే సమయానికి బడ్జెట్ రూ.4 కోట్లపైనే దాటేసింది. ముందుగా ఈ సినిమాకి"ఓ ప్రేమా"అనే టైటిల్ అనుకున్నారు. కానీ "నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా" అనే టైటిల్ ఎమ్మెస్ రాజు గారి చాయిస్. అయితే ఈ సినిమా టైటిల్ ని ఓకే చేశారు.ఇక ఈ సినిమాలో "స్వచ్ఛమైన ప్రేమ", అచ్చమైన అన్న చెల్లెలు అనుబంధంలను ఎంతో చక్కగా తెరకెక్కించారు. ఈ సినిమాలోని కథ "మల్లె తీగ లాగా అల్లుకుపోవడంతో" ఈ సినిమాలోని సీన్లు ఎక్కడ బోర్ కొట్టించలేదు. మొత్తంమీద తెరపై పరిచిన ప్రేమ కవిత్వం ఈ సినిమా. ఈ సినిమా సిద్ధార్థకి తెలుగులో మొదటి సినిమా. ఈ సినిమాకి మొత్తం మీద రూ.24 కోట్లు వచ్చింది. భారతీయ చరిత్రల అత్యధిక భాషల్లో రీమిక్ అయిన సినిమాగా ఎంపికయింది. ఈ సినిమాకి బెస్ట్ యాక్టర్స్, బెస్ట్ ఫిలిం తో పాటు మరో ఆరు అవార్డులు  గెలుచుకుంది. అంతేకాకుండా 5  నంది అవార్డులను కూడా సొంతం చేసుకుంది సినిమా.


మరింత సమాచారం తెలుసుకోండి: