పవర్ స్టార్ ఈపేరు వినగానే పవన్ అభిమానులు పూనకం వచ్చినట్లు ఊగిపోతు ఉంటారు. సినిమాల హిట్స్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా కొనసాగుతున్న ఈ మ్యానియా వెనుక ఏదో తెలియని మ్యాజిక్ ఉంది.  అందుకే పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఉండరు భక్తులు మాత్రమే ఉంటారని అన్నాడు హరీశ్ శంకర్.


గడిచిన ఎన్నికలలో పవన్ స్వయంగా ఓడిపోయినా అతడు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు పవన్ మ్యానియా పై కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. కన్నడ కంఠీరవగా కన్నడ సినిమా రంగాన్ని ఏలిన రాజ్ కుమార్ తనయుడే పునీత్ రాజుకుమార్ చైల్డ్ ఆర్టిస్టుగా శాండల్ వుడ్ లోకి ప్రవేశించిన పునీత్ ఇప్పుడు కన్నడ సినిమా రంగంలో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. అనేక జాతీయ అవార్డులు కూడ ఈయనకు వచ్చాయి.  


పూరీ జగన్నాథ్ ‘ఇడియట్’ రీమేక్ తో కన్నడ నాట స్టార్ హీరోగా  మారిపోయాడు. ఇలా అనేక సినిమాలలో పవర్ ఫుల్ రోల్స్ చేయడంతో అక్కడ అభిమానులు అతడిని ‘పవర్ స్టార్’ అని పిలుస్తూ ఉంటారు.    కన్నడ మీడియా కూడ పునిత్ రాజ్ కుమార్ గురించి వార్తలు వ్రాసేడప్పుడు పవర్ స్టార్ అని సంభోదిస్తుంది.


అయితే అలాంటి పునీత్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనను పవర్ స్టార్ అని పిలవ వద్దు అంటూ అభ్యర్ధించాడు. దీనికి కారణం పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అన్న ట్యాగ్ పవన్ కు మాత్రమే సరిపోతుందని తనకు ఏమాత్రం సరిపోదు అంటూ రాజ్ కుమార్ అభిప్రాయ పడుతున్నాడు. అంతేకాదు పవన్ కు ఉన్న హైవోల్టేజ్ ఎనర్జీ తనకు లేదని అందువల్ల పవర్ స్టార్ అన్న పిలుపుకు అన్ని విధాల పవన్ మాత్రమే సరిపోతాడు అంటూ సంచలన కామెంట్స్ చేసాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: