తెలుగు సినిమా పరిశ్రమలో హీరోగా రాణించడానికి ఎంతోమంది వస్తుంటారు. కానీ వారిలో అతి కొద్ది మంది మాత్రమే తనదైన ముద్రవేసి ఇండస్ట్రీలో పాతుకుపోతారు. ఇందులో ముఖ్యంగా వారి నటనా సామర్ధ్యం మరియు అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండు అంశాలలో ఏది కలిసి రాకపోయినా ఒక మాములు నటుడిగానే మిగిలిపోవాల్సి వస్తుంది. అలా ఇండస్ట్రీలో స్వశక్తితో పైకొచ్చిన అతి కొద్దిమంది నటులలో కార్తికేయ ఒకరు. ఇతనికి సినిమా అంటే పిచ్చి ప్రేమ. ఇతను హీరోగా 2017 లో "ప్రేమతో మీ కార్తీక్" వచ్చింది. కానీ ఈ సినిమా వచ్చినట్లు కూడా ఎవ్వరికీ తెలియదు. తరువాత సంవత్సరమే కొత్త దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన "ఆర్ ఎక్స్ 100" సినిమాతో హీరోగా మళ్ళీ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఒక మంచి విషాద ప్రేమకథగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

ఇది దర్శకుడి మొదటి సినిమా అయినప్పటికి ఎంతో అనుభవమున్న వాడిలాగా కథను డీల్ చేసిన విధానం సినీ పెద్దలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఇందులో కార్తికేయ నటన అద్భుతం అనాలి. అంతకు మించి మాటలు వాడలేము. ఇక పాయల్ రాజ్ పుత్ నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఆ తరువాత కార్తికేయకు వరుస అవకాశాలు వచ్చాయి. కార్తికేయ అవకాశాలు వచ్చినా ఉపయోగించుకోలేక పోయాడు. హిప్పీ, గుణ 369 , 90 ఎంఎల్, చావు కబురు చల్లగా సినిమాలలో హీరోగా నటించినా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడు. మరియు మధ్యలో గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ పాత్రను పోషించి విమర్శకుల ప్రశంశలను అందుకున్నాడు. దీనితో ఒక్కసారిగా కార్తికేయ సినిమా కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. సినిమా ఇండస్ట్రీ సైతం ఇక కార్తికేయ పని అయిపోయిందని ఫిక్స్ అయిపోయారు.

ఈ మధ్యనే వాలిమై సినిమాలో నటించనున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా మరొక వార్త కార్తికేయ అభిమానులకు శుభవార్తను అందించేలా ఉంది. "రాజా విక్రమార్క" సినిమాతో మరో సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్దమవుతున్నాడు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కాసేపటి క్రితమే వచ్చింది. ఈ సినిమాను నూతన డైరెక్టర్ శ్రీ సరిపల్లి తెరకెక్కించబోతున్నారు. రామ్ రెడ్డి ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఈ చిత్ర టైటిల్ ను ప్రముఖ డైరెక్టర్ సందీప్ వంగ లాంచ్ చేశారు. ఈ సినిమాలో కార్తికేయ ఒక సరికొత్త పాత్రతో ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నాడని తెలుస్తోంది. పోస్టర్ లో కార్తికేయ చైర్ లో కాళ్ళు చాపుకుని, రెండు చేతులు తల వెనుక పెట్టుకుని ఉన్నాడు. ఈ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో కార్తికేయ సరసన తాన్య నటించనుంది. మరిన్ని పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఈ సినిమాతో అయినా కార్తికేయ హిట్ ను సాధించి కెరీర్ లో నిలబడతాడా అన్నది చూడాల్సి ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: