అమేజాన్ ప్రైం సక్సెస్ ఫుల్ వెబ్ సీరీస్ ఫ్యామిలీ మ్యాన్ సీరీస్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఫ్యామిలీ మ్యాన్, ఫ్యామిలీ మ్యాన్ 2 కూడా ప్రేక్షకుల ఆదరణ లభించడంతో ఫ్యామిలీ మ్యాన్ 3 మీద ఆసక్తి పెరిగింది. ఫ్యామిలీ మ్యాన్ 1 సూపర్ హిట్ కాగా రెండో పార్ట్ లో సమంత నటించడం తమిళ అణాగారిన వర్గాల గురించి ప్రస్తావించడం తో ఫ్యామిలీ మ్యాన్ 2 మీద కొంతమంది ఆందోళనకారులు గొడవ చేశారు. అయితే ఇవేవి పట్టించుకోని సగటు ప్రేక్షకుడు వెబ్ సీరీస్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2 కూడా సక్సెస్ అవగా ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ 3 మీద ఫోకస్ పెట్టారు మేకర్స్.

అయితే ఫ్యామిలీ మ్యాన్ 2 లోనే ఈసారి చైనా బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ మ్యాన్ 3 ఉంటుందని హింట్ ఇచ్చారు. ఈ క్రమంలో ఫ్యామిలీ మ్యాన్ 3 లో తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నాడు అన్న వార్తల్లో కూడా నిజం లేదని తెలుస్తుంది. ఎందుకంటే తమిళ అమ్మాయి సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 లో నటించినందుకు గాను ఆమె మీద విపరీతమైన నెగటివ్ ట్రోల్స్ చేశారు. అలాంటిది తమిళంలో సూపర్ హిట్ ఫాం లో ఉన్న విజయ్ సేతుపతి ఈ సీరీస్ లో నటించడానికి ఆస్కతి చూపిస్తాడని చెప్పలేం.

ఫ్యామిలీ మ్యాన్ 3 బ్యాక్ డ్రాప్ వేరే కథ వేరే అని ఒకవేళ విజయ్ సేతుపతిని ఒప్పించే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ మీడియా చెబుతుంది. అయినా సరే కొంతమంది మాత్రం ఆ సీరీస్ లో తమిళ నటులు నటించడానికి వీలు లేదంటూ ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ ట్రోల్స్ స్టార్స్ దాకా వెళ్తాయా నిజంగానే విజయ్ సేతుపతి ఫ్యామిలీ మ్యాన్ 3 లో నటించడానికి సుముఖంగా లేడా అన్నది త్వరలో తెలుస్తుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: