‘మా’ సంస్థ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈసారి ఆశక్తి కలిగిస్తున్న ఎన్నికల రగడలో ఇంకా అనేక ట్విస్ట్ లు ఉండబోతున్నాయి అన్న సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఎప్పుడు మా సంస్థ ఎన్నికలలో ఆశక్తి కనపరచని బాలకృష్ణ ఈసారి పరోక్షంగా ‘మా’ ఎన్నికల విషయంలో వ్యూహాలు రచించబోతున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.



ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం జీవిత రాజశేఖర్ కు పరోక్షంగా మద్దతు ఇచ్చి బాలకృష్ణ మెగా కాంపౌండ్ మద్దతు ఇస్తున్న ప్రకాష్ రాజ్ ప్యానల్ కు చెక్ పెట్టాలని బాలకృష్ణ ఆలోచనలు అంటున్నారు. అంతేకాదు నందమూరి ఫ్యామిలీ అంటే అభిమానం కనపరిచే మా సంస్థ సభ్యులు సుమారు 200లు పైగా సభ్యులు ఉంటారని వారందరిని బాలయ్య పరోక్షంగా సమీకరించి జీవిత ప్యానల్ కు సపోర్ట్ ఇచ్చే ఆస్కారం ఉంది అన్న కామెంట్స్ కూడ ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్నాయి.


అయితే బాలకృష్ణ ఆలోచనలకు జూనియర్ కళ్యాణ్ రామ్ ల సహకారం తోడైతే బాలయ్య వ్యూహంలో విజయం సాధించడం ఖాయం అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ ప్రస్తుతం బాలయ్యకు జూనియర్ కు మధ్య సాన్నిహిత్యం అంతంతమాత్రంగా ఉన్న పరిస్థితులలో బాలయ్య వ్యూహాలకు ఎంతవరకు జూనియర్ సహకరిస్తాడు అన్నది ఒక ప్రశ్న అని అంటున్నారు.


ఇది ఇలా ఉండగా అధ్యక్ష స్థానానికి పోటీ చేయాలి అని భావిస్తున్న హేమకు మా సంస్థ సభ్యులలో సుమారు 100 మంది సపోర్ట్ ఉంది అంటున్నారు. ఇప్పుడు పరిస్థితుల ప్రకారం నిజంగా మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీలు పరోక్షంగా జరగబోయే మా సంస్థ ఎన్నికలను ప్రభావితం చేస్తే మా సంస్థ సభ్యులలో ఏ వర్గానికి చెందని న్యూట్రల్ ఓటర్లు ఈ అనవసరపు తలనొప్పులు తమకు ఎందుకు అనుకుని ఓటింగ్ కు దూరం అయ్యే పరిస్థితులు ఉన్నాయని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే ఈసారి ఏకగ్రీవంగా ఒక మహిళను మా సంస్థ అధ్యక్షురాలు గా చేసి కొనసాగుతున్న ఈ ఇగో వార్ కు చెక్ పెడితే మంచిది అని మరికొందరు సీనియర్ హీరోలు అభిప్రాయపడుతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి: