అమలాపాల్... తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పటికే ఈ అమ్మడు ఆమె అనే మూవీ కోసం బోల్డ్ గా నటించి అందరినీ షాక్ కు గురిచేసింది. తెలుగు తెర మీద విలక్షణ సినిమాలను విడుదల చేస్తూ.... ఆహా... ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ దూసుకుపోతుంది. మెగా బావ మరిది, అల్లు రామలింగయ్య తనయుడు అల్లు అరవింద్ ఈ ఓటీటీకి ఓనర్? తాజాగా అమలాపాల్ నటించిన కుడి ఎడమైతే అనే మూవీ సిరీస్ని కూడా ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ దక్కించుకుంది. కుడి ఎడమైతే సైంటిఫిక్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది.
అమలాపాల్ సరసన రాహుల్ విజయ్ నటిస్తున్నాడు. లూసియా, యూ టర్న్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న పవన్ కుమార్ దర్శకత్వంలో ఈ కుడి ఎడమైతే సిరీస్ రాబోతుంది. ఇటీవల విడుదల చేసిన... ఈ వెబ్ సిరీస్ మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఆహా వారు ప్రకటించిన ప్రకారంగా... ఈ నెల 16 నుంచి కుడి ఎడమైతే సిరీస్ ప్రసారం కానుందట.
అంతే కాకుండా ఈ సిరీస్ టీజర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. మీకెప్పుడైనా లైఫ్ లో జరిగిందే.. మళ్ళీ... మళ్ళీ జరిగినట్లు అనిపించిందా అనే మాటలతో టీజర్ ను ఆకర్షణీయంగా మలిచారు. ఈ టీజర్ లో అమలాపాల్ పోలీస్ ఆఫీసర్ గా.. రాహుల్ విజయ్ డెలివరీ బాయ్ గా కనిపిస్తున్నారు. మరో టాలీవుడ్ నటుడు రవి ప్రకాష్ ఈ టీజర్ లో కీలక పాత్రలో నటించాడు. ఈ సిరీస్ టీజర్ ను చూసిన ప్రేక్షకులకు థ్రిల్ కి గురవుతున్నారు. ఈ సిరీస్ లో ఏఏ సైంటిఫిక్ అంశాలను చూపించబోతున్నారని ఎదురు చూస్తున్నారు. ఇండియాలో డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రసారం కానున్న తొలి సైంటిఫికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అని తెలుస్తోంది. డైరెక్టర్ పవన్ రాజ్ కుమార్ కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తో కలిసి ద్విత్వ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు.