
సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు ఆర్థిక కారణాలతో ఆగిపోయి మధ్యలోనే సినిమాను అపేసుకున్నాయి. చిన్న హీరోల సినిమాలే కాకుండా పెద్ద హీరోల సినిమాలు కూడా మధ్యలో ఆగిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. రకరకాల కారణాలతో ఈ సినిమాలు మధ్యలో ఆగిపోయి సదరు సినిమా అభిమానులను ఎంతగానో కలవరపరిచాయి. తాము ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ఇలా అయిపోయిందా అని హీరోలు బాధపడ్డ సందర్భాలు కూడా బాగానే ఉన్నాయి. వాటిని తిరిగి పట్టాలెక్కించాలని ప్రయత్నించిన స్టార్ హీరోలకు సైతం అది సాధ్యపడలేదు. ఆ విధంగా టాలీవుడ్ లో ఆర్థిక ఇబ్బందులతో ఆగిపోయిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మెగాస్టార్ చిరంజీవి కోడి రామకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన అంజి సినిమా 1998లో షూటింగ్ ప్రారంభం కాగా ఆర్థిక సమస్యలతో ఈ సినిమా ఆగిపోయి మళ్ళీ 2004లో పూర్తి చేసుకుంది. అదే సంవత్సరం విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్, యాక్షన్ దర్శకుడు బి.గోపాల్ కలయికలో వచ్చిన యాక్షన్ చిత్రం ఆరడుగుల బుల్లెట్. నాలుగేళ్ల క్రితం థియేటర్స్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఫైనాన్షియల్ కారణాల వల్ల విడుదలకు కాలేదు. ప్రస్తుతం ఈ సినిమాను ఓ టి టి వేదికగా విడుదల చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అక్కినేని నాగార్జున నటించిన డమరుకం సినిమా కూడా రెండు సంవత్సరాల పాటు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. రెబల్ స్టార్ ప్రభాస్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కించిన రెబల్ చిత్రం కూడా ఆర్థిక ఇబ్బందులతో కొన్ని రోజులు ఆలస్యంగా విడుదల అయింది. బాలకృష్ణ పి.వాసు దర్శకత్వంలో చేసిన మహారథి సినిమా ఫైనాన్షియల్ కారణాల వల్ల కొన్ని సంవత్సరాల పాటు విడుదల ఆగిపోయింది. అక్కినేని నాగచైతన్య నటించిన ఆటోనగర్ సూర్య కూడా రెండు సంవత్సరాల పాటు ఆర్థిక ఇబ్బందులతో వాయిదా పడి తిరిగి విడుదలయింది. రామ్ చరణ్ మెరుపు కొరటాల శివ దర్శకత్వం లోని మరో చిత్రం, మహేష్ పూరి జగన్నాథ్ ల జన గణ మన, ఎన్టీఆర్ పేదోడు.. ఇలా చాలా సినిమాలు సెట్స్ పైకి వెళ్ళ లేకపోయాయి. 
