‘బాహుబలి’ తో ప్రభాస్ నేషనల్ సెలెబ్రెటీగా మారిపోవడంతో టాప్ యంగ్ తెలుగు హీరోలు అందరికీ బాలీవుడ్ పై మోజు పెరిగింది. దీనితో రామ్ చరణ్ జూనియర్ అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ ఇలా అనేకమంది క్రేజీ హీరోలు బాలీవుడ్ బాట పడుతున్నారు. వీరందరి ఫలితం ఇంకా పూర్తిగా తెలియకుండానే నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన షూటింగ్ ముంబాయ్ లో ప్రారంభం కావడంతో ఇప్పుడు చైతూ కూడ ఈ రేస్ లో చేరిపోయాడు.


అమీర్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘లాల్ సింగ్ చధా’ మూవీ షూటింగ్ స్పాట్ లో అమీర్ ఖాన్ తో జాయిన్ అయిపోయాడు. అమీర్ ఈమధ్య తన భార్య కిరణ్ రావ్ కు విడాకులు ఇచ్చి కొద్దిరోజులు కూడ గడవకుండానే ఏ సంఘటన జరగనట్లుగా అమీర్ షూటింగ్ స్పాట్ లో చాల ఉత్సాహంగా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో చైతన్య అమీర్ ఖాన్ కు ప్రాణ స్నేహితుడుగా కనిపిస్తాడు.


గత కొన్ని సంవత్సరాలుగా అమీర్ ఖాన్ నటిస్తున్న సినిమాలు అన్నీ ఫెయిల్ అవుతున్న పరిస్థితులలో ఈ మూవీలోని లాల్ సింగ్ పాత్రను అమీర్ చాల మనసు పెట్టి చేస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా అమీర్ ఖాన్ సినిమాలు అంటే బాలీవుడ్ లో మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా చాల క్రేజ్ ఉంటుంది. ఇలాంటి కీలక మూవీలో నాగచైతన్య కు ఒక కీ రోల్ రావడం ఒక టర్నింగ్ పాయింట్.


చైతన్య మాస్ సినిమాలలో కంటే డిఫరెంట్ కథలతో తీసిన సినిమాలలో బాగా రాణిస్తాడు. అమీర్ ఖాన్ సినిమాలు అంటేనే వైవిధ్యానికి ప్రతీక. అలాంటి వైవిధ్యమైన మూవీలో చైతన్యకు కీ రోల్ రావడం అతడి అదృష్టం అని అంటున్నారు. ప్రభాస్ జూనియర్ చరణ్ అల్లు అర్జున్ లు తమ కమర్షియల్ సినిమాలతో బాలీవుడ్ లో తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తూ ఉంటే చైతన్య తన డిఫరెంట్ పాత్రల ఎంపిక తో బాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తూ ఉండటంతో మన టాప్ యంగ్ హీరోలు అందరికీ చైతన్య టాలీవుడ్ లో గట్టి పోటీ ఇవ్వనప్పటికీ బాలీవుడ్ లో గట్టిపోటీ ఇచ్చే ఆస్కారం ఉంది అని అంటున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: