
మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో చేయబోతున్న వేదాలం సినిమా ఇప్పుడు కొంత ముందుకు జరిగింది. బాబి సినిమా ముందుగా చేయడమే దీనికి కారణమని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న ఆచార్య సినిమా కాకుండా మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. వాటిలో రెండు రీమేక్ సినిమాలు కాగా ఒకటి డైరెక్ట్ తెలుగు సినిమా. మలయాళం రీమేక్ సినిమా షూటింగ్ కి ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేశారు. తమిళ హిట్ చిత్రాల దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమా పూర్తి మెగాస్టార్ స్టైల్ లో తెరకెక్కుతుంది అని అంటున్నారు.
మొన్నటిదాకా ఈ సినిమా తర్వాత వేదాళం సినిమానే తెరకెక్కిస్తారని అనుకున్నారు కానీ సడన్ గా బాబీ సినిమాను ముందుకు తీసుకు రావడంతో ఈ సినిమా వెనక్కి జరిగింది. కారణమేంటో తెలియదుగానీ మెహర్ రమేష్ సినిమాపై మొదటినుంచి అనుమానాలే ఉన్నాయి. గతంలో ఆయన చేసిన సినిమాలు భారీ డిజాస్టర్లుగా మిగలడం తో మెగా అభిమానుల నుంచి ఆయనకు తీవ్రమైన వ్యతిరేకత ఉంది. భారీ డిజాస్టర్ లు అందించిన దర్శకుడు తో సినిమా చేయడం ఏంటి అని మెగాస్టార్ చిరంజీవి నీ ప్రతి ఒక్కరూ ప్రశ్నించారు. ఇది రీమేక్ సినిమా కావడంతో పెద్దగా అనుమాన పడాల్సిన అవసరం లేదని ఆయన చెబుతూ వచ్చారు.
మెహర్ రమేష్ కూడా మళ్లీ ఫామ్ లోకి రావడానికి ఇదే సరైన సినిమా అని సమయం అని భావించి మెగాస్టార్ చిరంజీవి తో ఈ సినిమా తో ముందుకు వెళుతున్నాడు. గతంలో శక్తి షాడో వంటి భారీ డిజాస్టర్ ను అందించిన మెహర్ రమేష్ మళ్లీ మరొక సినిమా చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది. మెగాస్టార్ చిరంజీవి అవకాశం ఇవ్వడంతో ఆయన లో మళ్లీ ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా హిట్ చేసి తనను తాను నిరూపించుకుంటాడా మెహర్ రమేష్ చూడాలి. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.