బాలీవుడ్ సెక్స్ బాంబ్ సన్నీ లియోన్ జిస్మ్-2 అనే ఒక అడల్ట్ థ్రిల్లర్ సినిమాతో భారతీయ చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఇక ఆ తర్వాత ఆమె అనేక బోల్డ్ క్యారెక్టర్స్ లో నటించి కుర్రకారుకి చెమటలు పట్టించారు. ఆమె హిందీ సినిమాలలోనే కాదు దక్షిణాది సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. సౌత్ ఫిలిం ఇండస్ట్రీ సినిమాల్లో ఆమె ముఖ్యంగా ఐటమ్ సాంగ్స్ లో చిందేసి ప్రేక్షకులకు పిచ్చెక్కించారు. మంచు మనోజ్ హీరోగా నటించిన "కరెంట్ తీగ" సినిమా తో ఆమె టాలీవుడ్ పరిశ్రమకు పరిచయం అయ్యారు. అనంతరం పిఎస్వి గరుడ వేగా చిత్రంలో "డియో డియో" ఐటమ్ సాంగ్ లో సెగలు పుట్టించే డాన్స్ స్టెప్పులు వేసి వావ్ అనిపించారు. ఇక ఆ తర్వాత ఆమె తెలుగు తెరపై కనిపించలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆమె ఒక తెలుగు సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేయనున్నారని తెలుస్తోంది.
వై. రాజ్‌కుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న "కాటన్‌పేట్ గేట్" అనే
కన్నడ చిత్రంలో ఆమె స్పెషల్ సాంగ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో సీతన్నపేట గేట్ గా కూడా తీస్తున్నారు. దీంతో ఆమె మళ్లీ తెలుగు తెరపై మెరవనున్నారు అని చెప్పుకోవచ్చు. దాదాపు 7 నెలల క్రితం యంగ్
హీరో నిఖిల్
సిద్ధార్థ్ "సీతన్నపేట గేట్" టీజర్ విడుదల చేశారు. కాగా ఈ టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ
సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోంది కానీ
కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే త్వరలోనే
హైదరాబాద్ నగరంలో
సన్నీ లియోన్ ఐటమ్ సాంగ్ కి సంబంధించి షూటింగ్ ప్రారంభించనున్నారు అని సమాచారం. ఈ సాంగ్ షూట్ చేస్తే.. ఇక చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని సమాచారం.
యశ్వన్, వేణు, కిస్లీ చౌధురి,
సురభి తివారి తదితర నటీనటులు సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. విజయవాడ, సీతన్నపేట గేట్ ప్రాంతంలో జరిగిన వాస్తవ
ప్రేమ కథల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నానని అని
డైరెక్టర్ వై. రాజ్‌కుమార్ వెల్లడించారు. ఇకపోతే ఈ చిత్రాన్ని ఎ. పద్మనాభరెడ్డి నిర్మిస్తున్నారు.