
మొదటగా ఫస్ట్ షెడ్యూల్ ని దుబాయ్ లో జరిపిన యూనిట్, ఇటీవల రెండవ షెడ్యూల్ ని హైదరాబాద్ లో మొదలు పెట్టారు, అయితే మధ్యలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా అది ఆగిపోయింది. తమిళ నటుడు సముద్రఖని విలన్ గా ఈ సినిమాలో నటిస్తుండగా అర్జున్ సర్జా ఒక పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఇక గత ఏడాది మహేష్ జన్మదినం సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ నుండి కూడా మంచి క్రేజ్ లభించింది. ఇక అసలు విషయం ఏమిటంటే, నేడు ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్రారంభం కావడంతో సర్కారు వారి పాట యూనిట్ కొద్దిసేపటి క్రితం ఒక లేటెస్ట్ పోస్టర్ ని విడుదల చేసింది.
అందులో దర్శకడు పరశురామ్ పెట్ల హీరో మహేష్ తో ఏదో మాట్లాడుతూ ఉండగా, మహేష్ కూర్చుని ఉన్న వెనుక భాగం ఫోటోని విడుదల చేసారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో చూపించిన విధంగానే నేడు రిలీజ్ చేసిన మహేష్ వెనుక భాగం లుక్ లో ఆయన చెవికి పోగు, అలానే మెడ మీద రూపాయి ట్యాటూ ధరించి ఉండడం గమనించవచ్చు. మొత్తంగా కొద్దిసేపటి క్రితం విడుదలైన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతోంది. కాగా ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఎట్టిపరిస్థితుల్లో ముందుగా అనుకున్న విధంగా 2022 సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట నిర్మాతలు .... !!