కె.జి.ఎఫ్ తర్వాత టాలీవుడ్ స్టార్స్ అంతా ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సినిమా కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ తో సలార్ అంటూ ఓ సెన్సేషనల్ ప్రాజెక్ట్ సెట్స్ మీద ఉండగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో కూడా ప్రభాస్ సినిమా ఉండబోతుందని తెలిసిందే. ప్రభాస్ తో తీసే సలార్ సినిమా ఆల్రెడీ ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ రచ్చ మాములుగా ఉండదని టాక్. మాములుగానే హీరో ఎలివేషన్స్ లో దిట్ట అయిన ప్రశాంత్ నీల్ బాహుబలి ప్రభాస్ ను భారీ ఎలివేట్ చేసే సీన్స్ సలార్ లో పెట్టేస్తున్నాడట.

సలార్ గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా సృష్టిస్తున్నారు. లేటెస్ట్ గా సినిమా నుండి మరో అప్డేట్ ప్రేక్షకులను అలరిస్తుంది. ప్రభాస్ సలార్ ఇంటర్వల్ ఫైట్ మాములుగా ఉండదట. సినిమాలో ఈ ఫైట్ హైలెట్ గా ఉంటుందని చెప్పుకుంటున్నారు. రామోజి ఫిల్మ్ సిటీలో ఈ ఫైట్ కోసం ప్రత్యేక సెట్ వేసినట్టు తెలుస్తుంది. సలార్ సినిమాలో ప్రభాస్ ను నెక్స్ట్ లెవల్ లో చూపించాలని ఫిక్స్ అయ్యాడు ప్రశాంత్ నీల్. అనుకున్నట్టుగానే మొదటి షెడ్యూల్ షూట్ సక్సెస్ ఫుల్ గా పూర్తయింది.

ఇక నెక్స్ట్ షెడ్యూల్ లో ఇంటర్వల్ సీన్స్ భారీ ఫైట్ షూట్ చేస్తున్నారట. దీని కోసం ఆర్ఫెసీ లో ప్రత్యేకమైన సెట్ వేసినట్టు తెలుస్తుంది. సినిమాలో ప్రధాన అంశాల్లో ఈ ఫైట్, ఇంటర్వల్ సీన్ కూడా ఉంటాయట. సలార్ లో ఇంటర్వల్ సీన్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరు సీట్లలో కూర్చోరని చెబుతున్నారు. కె.జి.ఎఫ్ చాప్టర్ 2 తో త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తున్న ప్రశాంత్ నీల్ ఆ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. తప్పకుండా సలార్ కూడా అదే బాటలో ప్రశాంత్, ప్రభాస్ కాంబో సెన్సేషనల్ అయ్యేలా చేస్తుందని చెప్పుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: