
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు కు పెద్దగా విలువ ఇవ్వరు అనే ప్రచారం బయట బాగా సాగుతుంది. వాళ్ళు ఇలా పెళ్లి చేసుకుని అలా విడిపోతున్న ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. దాంతో ఈ రకమైన ప్రచారం బయట నెలకొని ఉంది. కొంతమంది మాత్రం పెళ్లిళ్ల ను చాలా కాలం పాటు కొనసాగిస్తూ వాటికి విలువనిస్తూ సంతోషంగా తమ వైవాహిక జీవితాన్ని గడుపుతున్నారు. ఉదయం ప్రేమలోపడి సాయంత్రం పెళ్లిళ్లు చేసుకుని సరైన అవగాహన లేక విడిపోతున్న ఈ రోజులలో ఆ విధంగా తన పెళ్లి జరుపుకుని ఎంతో అన్యోన్యంగా తన జీవితాన్ని కొనసాగిస్తుంది ఓ నటి.
ఆమె ఎవరో కాదు తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అమ్మ అక్క వదిన చెల్లెలు తదితర పాత్రల్లో నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న సీనియర్ నటి తులసి. తెలుగులో తులసి సెల్వమణి దాదాపుగా అందరు స్టార్ హీరోలతో నటించింది. ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాత్రలకు చక్కగా సరిపోయే ఈమె సెంటిమెంట్ సన్నివేశాలలో కంటతడి పెట్టిస్తుంది. ఇటీవలే ఆమె యూట్యూబ్ ఛానల్ లో తన కెరీర్ గురించి అనుభవాల గురించి జీవిత విశేషాల గురించి ప్రేక్షకులతో పెంచుకుంది.
ఈ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ప్రస్తావించి అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేశారు. అప్పట్లో కన్నడ సినీ పరిశ్రమ లో మదర్ ఇండియా అనే సినిమాలో ఛాన్స్ రావడంతో చెన్నైకి వెళ్లాను అని అక్కడ దర్శకుడు సెల్వమని ను షూటింగ్ లో కలుసుకున్నానని , ఆయనను చూడడం అదే మొదటిసారి అయినప్పటికీ చూడగానే ప్రేమలో పడిపోయిన భావన కలిగింది అని చెప్పుకొచ్చింది. అయితే ఈమెకు ప్రేమను ప్రపోజ్ చేసింది మాత్రం సెల్వమనే కావడం విశేషం అని అన్నారు. షూటింగ్ పూర్తయ్యాక ఇద్దరు దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. ఇదంతా ఒక్కరోజు లో జరిగి పోయిందట. ఈ విషయాన్ని చెప్పి ఒకసారి అందరినీ షాక్ కి గురి చేసింది. మొదట్లో తన భర్తకు సిగరెట్ అలవాటు ఉండేదని తర్వాత దాన్ని మానేశాడు అని తెలిపింది.