జూనియర్ ఎన్టీఆర్ కి కార్లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటికే తారక్ దగ్గర పలు కంపెనీలకు చెందిన కార్లు ఉన్నాయి.ఇక తాజాగా 'లాంబోర్గిని ఊరుస్' అనే ఇటాలియన్ మోడల్ లగ్జరీ కారును కొనుగోలు చేసినట్లు ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ కారు విలువ దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల మధ్యలో ఉంటుందని సమాచారం.అయితే తాజాగా ఈ కారు ఎన్టీఆర్ ఇంటికి చేరింది.ఈ కారును ఎన్టీఆర్ ఎంతో ముచ్చటపడి కొనుక్కున్నాడట.సరికొత్త ఫీచర్స్ తో ఉన్న ఈ కారుని ఎన్టీఆర్ తన కోసం కొనలేదట.అయితే మరి ఎవరి కోసం ఈ అత్యంత ఖరీదైన కారును ఎన్టీఆర్ కొన్నాడు?అనే విషయాన్ని నెటిజన్లు ఆరా తీయగా..

తన తల్లి షాలిని కోసం ఎన్టీఆర్ ఈ కారును కొన్నట్లు తెలుస్తోంది.తన తల్లి కోసమే ప్రత్యేకంగా ఇటలీ నుంచి ఎంతో ప్రత్యేకంగా ఈ కారును బుక్ చేసాడు.అలాగే ఈ కారు రిజిస్ట్రేషన్ కూడా తన తల్లి షాలిని పేరు మీదే చేయించాడు.అయితే నిజానికి షాలిని ఎక్కువగా బయటికి రారు.అయినా ఎన్టీఆర్ ఈ కారును తన తల్లికి గిఫ్ట్ గా ఇవ్వడానికి ముఖ్య కారణం,ఆమె ఫ్యామిలీ ఫంక్షన్లకు, గుడికి వెళ్ళడానికి తారక్ ఈ కారును కొన్నట్లు సమాచారం.ఏది ఏమైనా మన సినీ సెలెబ్రెటీలకి ఖరీదైన లగ్జరీ కార్లు కొనడం అనేది ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయింది. ఇక మొన్నటికి మొన్న మన పవన్ కళ్యాణ్ సైతం ఖరీదైన ఓ రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేసాడు.

ఇప్పుడున్న ప్రతీ స్టార్ హీరోకి ఇలాంటి ప్రత్యేకమైన కార్లు నాలుగైదు ఉన్నాయి.ముఖ్యంగా ఈ 'లాంబోర్గిని ఉరుస్' కార్లంటే మన స్టార్ హీరోలకి చాలా ఇష్టం.ఇప్పటికే రణ్వీర్ సింగ్,రణబీర్ కపూర్, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి అగ్ర హీరోలకి ఈ కార్లు ఉన్నాయి.ఇక తాజాగా ఈ లిస్టు లో ఎన్టీఆర్ కూడా చేరిపోయాడు.ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాటు బుల్లితెరపై ప్రసారం కానున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' అనే షో కి సంబంధించిన షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.ఆగస్టు 15 న రామ్ చరణ్ మొదటి గెస్ట్ గా ఈ షో జెమినీ టీవీ లో టెలికాస్ట్ కానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: