మన హీరోలు తమ సినిమాల్లో ప్రకృతి గురించి..వ్యవసాయం,రైతుల గురించి గొప్పగా చెబుతుంటారు. అంతేకాదు సినిమాలో కథ డిమాండ్ చేస్తే కొన్ని కొన్ని సన్నివేశాల్లో రైతుగా కూడా మారి వ్యవసాయం చేస్తారు.కానీ నిజ జీవితంలో ఆ వ్యవసాయంపై మక్కువతో సాగు చేసే వారు చాలా తక్కువ మంది ఉంటారు.మన తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ లాంటి వారు నగరానికి దూరంగా ఫామ్ హౌజ్ లు కట్టుకొని వాటిలో నిజంగానే వ్యవసాయం చేస్తున్నారు.తాజాగా కరోనా కల్లోలం వల్ల సినిమా అవకాశాలు తగ్గిపోయి తన సొంత ఊరికి వెళ్లి వ్యవసాయం చేస్తున్నాడు ఓ ప్రముఖ నటుడు.

రైతుగా మారి ఆ నటుడు చేస్తున్న కొన్ని పనులు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బయటికొచ్చి ఎంతో వైరల్ గా మారాయి.కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఒకవైపు షూటింగ్స్ లేక సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటే.. మరోవైపు కొందరు నటీ నటీలు అవకాశాలు తగ్గి సినీ ఇండ్రస్టీకి దూరం అవుతున్నారు. ఇప్పుడు అలా కరోనా కారణంగా సినిమా అవకాశాలు తగ్గి ఓ నటుడు రైతుగా మారాడు.బాలీవుడ్ నటుడు ఆశిష్ శర్మ తాజాగా ముంబై ని వీడి.. రాజస్థాన్ లో వ్యవసాయం చేసుకుంటూ రైతుగా మారి ఎంచక్కా ప్రశాంతమైన వాతావరణాన్ని గడుపుతున్నాడు.

 "మోడీ :జర్నీ ఆఫ్ కామన్ మ్యాన్" అనే వెబ్ సీరీస్ తో దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీని తెచ్చుకున్నాడు ఆశిష్ శర్మ.ఇక ఆ తర్వాత' సియా కే రామ్' అనే సీరియల్ తో మంచి క్రేజ్ వచ్చింది.అయితే కరోనా కారణంగా సినీ ఇండ్రస్టీ మూత పడడంతో అవకాశాలు లేక ముంబై నుండి తన స్వస్థలం రాజస్థాన్ కు వెళ్ళిపోయాడు.ఇప్పుడు అక్కడే రైతుగా మారి వ్యవసాయం చేస్తున్నాడు. దాదాపు 40 ఎకరాల్లో చేస్తున్నాడట ఆశిష్ శర్మ.అంతేకాదు సినిమాల కంటే తనకు ఈ లైఫ్ ఎంతో ఆనందంగా ఉందని చెప్పడం విశేషం.ప్రస్తుతం ఆశిష్ శర్మ వ్యవసాయ పనులకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: