టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం విడుదలై నేటికీ రెండు వసంతాలు పూర్తి చేసుకోగా 2019 లో వచ్చిన ఈ సినిమా విజయ్ దేవరకొండ అభిమానులను ఎంతగానో అలరించింది. బ్యూటిఫుల్ ప్రేమకథగా మంచి యాక్షన్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఎక్కువగా మహిళలను మెప్పించింది. తను ప్రేమించిన అమ్మాయి కలను నిజం చేసేందుకు హీరో చేసే పోరాటమే ఈ డియర్ కామ్రేడ్. క్రికెట్ లో రాణించాలని కలలు కంటోంది హీరోయిన్. ఈ నేపథ్యంలోనే ఆమె హీరోతో ప్రేమలో పడుతుంది.

ఆ తర్వాత ఓ ఇన్సిడెంట్ వల్ల ఆమెకి క్రికెట్ కి దూరమవుతుంది. జరిగిన ఇన్సిడెంట్ గురించి తెలుసుకున్న విజయ్ అందులో తప్పు ఒప్పులు విచారించి హీరోయిన్ కలని ఎలా నిజం చేశాడు ఆనే కథాంశం తో వచ్చిన ఈ సినిమా యూత్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ముఖ్యంగా విజయ్ దేవరకొండ రష్మిక కెమిస్ట్రీ వారికి ఎంతగానో కిక్ ఇచ్చింది. గతంలో వీరిద్దరూ గీత గోవిందం సినిమాలో నటించగా ఆ సినిమా సూపర్ హిట్ అయింది. అక్కడ వీరి జంటను ఎంతగానో ఇష్టపడ్డ ప్రేక్షకులు వీరిని మళ్లీ తెరపై చూడాలన్న కోరిక తొందరగానే డియర్ కామ్రేడ్ రూపంలో తీరింది. 

భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించగా జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. ఈ సినిమా మ్యూజికల్ గా కూడా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ద్వారా బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించింది నిర్మాతలకు. విజయ్ దేవరకొండ ను సరికొత్త స్టైల్ లో చూపించిన సినిమా ఇది. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా గతంలో విజయ్ దేవరకొండ చాలా సినిమాలలో కనిపించగా ఈ సినిమాలో కొత్తరకం యాంగ్రీ యంగ్ మ్యాన్ గా కనిపించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: