టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే.సుజిత్ డైరెక్షన్లో వచ్చిన సాహో సినిమా అనంతరం ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా విడుదల చేయాలని అనుకున్నాడు ఈ హీరో.కానీ పాన్ ఇండియా హోదా వల్ల అది కుదిరేలా కనిపించడం లేదు.ప్రభాస్ సినిమా మార్కెట్ అంతర్జాతీయ స్థాయిలో పెరగడమే అందుకు కారణం.ఇప్పుడు ప్రభాస్సినిమా మొదలు పెట్టినా.. అది ప్రేక్షకుల ముందుకు రావడానికి కనీసం రెండేళ్లు పడుతుంది.ఇక తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ k అయితే ఆడియన్స్ ముందుకు రావడానికి ఏకంగా నాలుగేళ్ళ సమయం పడుతుందట.

పక్కా సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం వైజయంతి బ్యానర్ ఏకంగా 500 కోట్లు ఖర్చు చేయనుంది.గత ఏడాది అనౌన్స్ చేసిన ఈ సినిమా 2023 లో ప్రేక్షకుల ముందుకు రావచ్చని నిర్మాత అశ్వనీదత్ ముందే ఓ క్లారిటీ ఇచ్చాడు. కానీ లేటెస్ట్ ప్లాన్ ప్రకారం ఈ సినిమా 2024 లో రావచ్చని చెబుతున్నారు.అంతేకాదు హాలీవుడ్ లో కూడా ఈ సినిమాని భారీ ఎత్తున విడుదల చేయాలని అనుకుంటున్నారు మేకర్స్.దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేస్తాడా అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమాలో బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తోంది.ఇక మరోవైపు దీనికంటే ప్రభాస్ ఇప్పటికే మూడు సినిమాలను లైన్లో పెట్టాడు.అందులో రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్న 'రాధే శ్యామ్' షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న 'సలార్'అలాగే ఓం రావుత్ ఆదిపురుష్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.ఈ రెండు సినిమాలను సమాంతరంగా షూటింగ్స్ పాల్గొని ఒకేసారి పూర్తి చేయాలని చూస్తున్నాడు ప్రభాస్.రాధే శ్యామ్ షూటింగ్ పూర్తయ్యాక ఈ రెండు సినిమాలను తిరిగి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు ఈ పాన్ ఇండియా హీరో...!!

మరింత సమాచారం తెలుసుకోండి: