టాలీవుడ్ సీనియర్ హీరోలలో చిరంజీవి, బాలయ్యలది ప్రత్యేక స్థానం. ఈ ఇద్దరు హీరోలూ ఎనభై, తొంబై దశకంలో టాలీవుడ్ ని పోటాపోటీగా ఏలారు. ఈ రోజుకూ మాస్ అంటే వీరే అన్నట్లుగా ఉంటారు. ఇక నాటౌట్ అంటూ యంగ్ హీరోలకు ఇప్పటికీ పోటీ ఇస్తున్న బాలయ్య, చిరు కెరీర్ లో ఎన్నో ఇంటరెస్టింగ్ మ్యాటర్స్ ఉన్నాయి.

బాలక్రిష్ణ విషయానికి వస్తే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీయార్ నట వారసుడు. బాలయ్య 14 ఏళ్ళకే హీరో అయిపోయారు. చిరంజీవి ఫిల్మ్ ఇన్సిట్యూట్ లో చేరి శిక్షణ పొందారు. ఇక చిరంజీవికి  మొదటి రెండు సినిమా  అవకాశాలు అలా వెతుక్కుంటూనే వచ్చాయి. ఆ తరువాత ఆయన వేట మొదలెట్టారు. ఈ టైమ్ లో అప్పటికే ప్రముఖ దర్శకుడిగా ఉన్న దాసరినారాయణరావు తన సొంత బ్యానర్ తారకప్రభు సంస్థ మీద తొలి చిత్రాన్ని తీయడానికి సన్నాహలు చేస్తున్నారు.

హీరోయిన్ గా జయసుధను అనుకున్నారు. లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. ఇక హీరో కొత్త వారు అయితే ఆ కధకు సరిపోతుంది. ఎందుకంటే జయసుధ ఆ మూవీలో సినీ హీరోయిన్. ఆమె వీరాభిమాని హీరో. దాంతో కొత్తవారు కావాలని దాసరి సెర్చ్ చేస్తున్నారు. అలా చాలా మందిని చూశారు. అప్పట్లో చిరంజీవి, హరిప్రసాద్, సుధాకర్ ఒకే రూమ్ లో ఉండేవారు. వీరు ఈ విషయం తెలుసుకుని దాసరిని కలిశారు. అయితే ఇందులో హరిప్రసాద్ ఫేస్ అమాయకంగా ఉండడంతో ఆయన్నే దాసరి ఎంపిక చేశారట. చిరంజీవిలో మంచి చలాకీతనం ఉంది. ఆయనలో హీరో మెటీరియల్ ఉన్నా ఆ మూవీ కధకు అమాయకమైన ఫేస్ కావాలనే హరిప్రసాద్ ని తీసుకున్నారుట. అలా చిరంజీవికి శివరంజని వంటి సూపర్ హిట్ మూవీలో నటించే చాన్స్ తప్పిపోయింది.

ఇదే విధంగా బాలక్రిష్ణకు కూడా జరిగింది. ఆయన అప్పటికి డిగ్రీ చదువుతున్నారు. తన సినిమాలో కొత్త హీరో కావాలని. బాలయ్య అయితే బాగుంటుంది అని దాసరి ఎన్టీయార్ ని కోరారుట. అయితే డిగ్రీ పూర్తి అయితే తప్ప బాలయ్యని వేరే బ్యానర్లలో నటించడానికి అనుమతించను అని ఎన్టీయార్ చెప్పేశారుట. దాంతో బాలయ్య శివరంజని మూవీలో హీరోగా నటించే చాన్స్ కోల్పోయారని చెబుతారు. మొత్తానికి దాసరి తో ఈ ఇద్దరు నటించడానికి చాలా కాలమే పట్టిందని చెప్పాలిక్కడ.



మరింత సమాచారం తెలుసుకోండి: